Beauty Tips : మొటిమ‌లు, ముడుత‌లు ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతున్నారా… అయితే ఈ నాచుర‌ల్ చిట్కాను పాటించండి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : మొటిమ‌లు, ముడుత‌లు ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతున్నారా… అయితే ఈ నాచుర‌ల్ చిట్కాను పాటించండి ..!

 Authored By anusha | The Telugu News | Updated on :19 June 2022,5:00 pm

Beauty Tips : మ‌న పూర్వీకులు ముఖానికి ఎక్కువ‌గా బియ్యంపిండిని వాడేవారు. దీనిని సున్నిపిండిగా చేసుకొని ముఖానికి రాసుకునేవారు. ఇలా రాసుకోవ‌డం వ‌ల‌న ముఖానికి ఉన్న జిడ్డు తొల‌గిపోయి, ఫేస్ అందంగా నిగ‌నిగ‌లాడుతుంది. ప్ర‌తిరోజు స్నానం చేసేట‌ప్పుడు ఈ వ‌రిపిండితో శ‌రీర‌మంతా రుద్దుకుంటే చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా త‌యార‌వుతుంది. బియ్యంపిండి శ‌రీరాన్ని ప్ర‌కాశ‌వంతంగా చేయ‌డానికి, జిడ్డును తొల‌గించ‌డానికి, న‌ల్ల మ‌చ్చ‌లు తొల‌గించ‌డానికి బాగా స‌హాయ‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలోని ముడుత‌లు పోవ‌డానికి ఈ బియ్యంపిండి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కుతు చెబుతున్నారు. ఈ బియ్యంపిండిని ముఖానికి ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఎలా త‌యారుచేసుకోవాలో తెలుసుకుందాం… ముందుగా కొన్ని బియ్యాన్ని క‌డిగి కొన్ని నీళ్లు పోసుకొని 12 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.

త‌రువాత కొన్ని నీళ్లు ఉంచి మెత్త‌గా, పేస్ట్ లాగా మిక్సి ప‌ట్టుకోవాలి. దీనిని ఒక గిన్నె తీసుకొని వ‌డ‌గ‌ట్టుకుంటే పాల లాంటి ద్ర‌వం వ‌స్తుంది. త‌రువాత ఈ ద్ర‌వాన్ని గ్యాస్ పై పెట్టి ద‌గ్గ‌ర అయ్యేవ‌ర‌కు బాగా ఉడికించుకోవాలి. ఈ ద్ర‌వంలో ఉండే బెంజాయిక్ ఆమ్లం మ‌న శ‌రీరంలోని మురికిని పోగొడుతుంది. అలాగే దీనిలో ఉండే ఫైటిక్ యాసిడ్ చ‌ర్మంపై ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీనిలో ఉండే పారా మోనా బెంజాయిక్ యాసిడ్ సూర్యుడి నుండి వెలువ‌డే అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి మ‌న చ‌ర్మాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఈ బియ్యం పేస్ట్ ను ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం… మొటిమ‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారు రెండు స్ఫూన్ల బియ్యంపేస్ట్ లో ఒక స్ఫూన్ ఆముదం, ఒక స్ఫూన్ రోజ్ వాట‌ర్ వేసుకొని బాగా క‌లిపి మొటిమ‌లు ఉన్న‌చోట రాసుకోవాలి.

Beauty Tips to remove the pimples in face getting glowing skin

Beauty Tips to remove the pimples in face getting glowing skin

ఇలా ఒక రెండు నెల‌లు రాసుకుంటే ముఖంపై ఉన్న మొటిమ‌లు త‌గ్గుతాయి. అలాగే శ‌రీరంపై ముడుత‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారు రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ కొబ్బ‌రిపొడి, ఒక స్ఫూన్ వాల్న‌ట్ పౌడ‌ర్ వేసుకొని బాగా క‌లిపి చ‌ర్మానికి రాసుకుంటే శ‌రీరంపై ఉండే ముడుత‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా, నిగ‌నిగలాడుతుంది. అలాగే న‌ల్ల‌గా ఉన్న‌వారు తెల్ల‌గా కావాలంటే రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ తేనే, ఒక స్ఫూన్ పాలు వేసుకొని బాగా క‌లిపి ముఖానికి రాసుకుంటే న‌లుపు రంగు పోయి తెల్ల‌గా మెరుస్తారు. అలాగే పొడి చ‌ర్మం ఉన్న‌వారికి చ‌ర్మం ప‌గులుతుంది. అలాంటివారు రెండు స్ఫూన్ల‌ బియ్యంపిండి పేస్ట్ లో ఒక స్ఫూన్ పాలు, ఒక స్ఫూన్ తేనే, ఒక స్ఫూన్ క‌ల‌బంద గుజ్జును వేసుకొని బాగా క‌లుపుకోవాలి.

దీనిని ప‌గిలిన చ‌ర్మంపై రాసుకోవాలి. కొద్దిసేప‌టి త‌రువాత క‌డిగేసుకుంటే ప‌గిలిన చ‌ర్మం రీక‌వ‌ర్ అవుతుంది. అలాగే కొంత‌మందికి ముఖంపై జిడ్డు ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాంటివారు రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ ప‌సుపు, ఒక స్ఫూన్ గంధం, ఒక స్ఫూన్ రోజ్ వాట‌ర్ వేసుకొని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ముఖంపై రాసుకొని ఒక అర‌గంట ఉంచుకోవాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కుంటే ముఖంపై ఉన్న జిడ్డు అంతా తొల‌గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. బియ్యంపిండితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు క‌నుక ఈ చిట్కాను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌య‌త్నించండి. మీ ముఖాన్ని ముడుత‌లు, మొటిమ‌లు రాకుండా కాపాడుకోండి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది