Green Peas : పచ్చిబఠానీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Green Peas : పచ్చిబఠానీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Green Peas : పచ్చి బఠానీలు అనేవి ఎంతో రుచికరమైనవి మాత్రమే కాక, దానిలో పోషకాలకు కూడా గొప్ప మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు పచ్చి బఠానీ లో 160 గ్రాముల విటమిన్లు మరియు మినరల్స్ అనేవి ఉంటాయి. పచ్చి బటనీలు మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్లకు మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు బఠానీలో ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు అనేవి ఉంటాయి. పచ్చి బఠానీలు చాలా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారం. అంటే […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Green Peas : పచ్చిబఠానీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Green Peas : పచ్చి బఠానీలు అనేవి ఎంతో రుచికరమైనవి మాత్రమే కాక, దానిలో పోషకాలకు కూడా గొప్ప మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు పచ్చి బఠానీ లో 160 గ్రాముల విటమిన్లు మరియు మినరల్స్ అనేవి ఉంటాయి. పచ్చి బటనీలు మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్లకు మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు బఠానీలో ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు అనేవి ఉంటాయి. పచ్చి బఠానీలు చాలా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారం. అంటే వీటిని తినడం వలన మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరగవు. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…

పచ్చిబఠానీ తీసుకోవటం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది.దీనిలో పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. పచ్చి బఠానీలు క్యాన్సర్ ను తగ్గించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది అనే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇతర పోషకాల కు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇవి కణాలను దెబ్బ తినకుండా మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సహా పిల్లలకు అవసరమైన ఎన్నో పోషకాలకు పచ్చి బఠానీ మంచి మూలం. పచ్చి బఠానీలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ మంచి మూలం.ఇది ఎముకలను రక్షించడానికి మరియు బలోపేతం చేసేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బఠానీ లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉన్నాయి.

Green Peas పచ్చిబఠానీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Green Peas : పచ్చిబఠానీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

పచ్చి బఠానీలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మరియు గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు, మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బాఠానీలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జర్ణక్రియను ఎంతో మెరుగు పరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది. పచ్చి బఠానీలు ప్రోటీన్లకు మంచి మూలం అని చెప్పవచ్చు. ప్రోటీన్ కండరాల పెరుగుదల నిర్వహణకు కూడా చాలా అవసరం. పచ్చి బఠానీ లలో ఉండే విటమిన్ ఎ,సి క్యాన్సర్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది