Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Brass Vessel : మీ వంట గదిలో మెటల్ పాత్రలు ఉండే ఉంటాయి. అయితే వాటిని మీ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండుతూ ఉంటారు. అయితే ఎంతో మంది అల్యూమినియం పాత్రను కూడా ఉపయోగిస్తారు. మరికొందరు అయితే స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా వంట చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇత్తడి, ఇనుము, మట్టి పాత్రలో కూడా ఆహారాన్ని వండుకునే వాళ్లు ఎంతో మంది గ్రామాల్లో ఉన్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!

Brass Vessel : మీ వంట గదిలో మెటల్ పాత్రలు ఉండే ఉంటాయి. అయితే వాటిని మీ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండుతూ ఉంటారు. అయితే ఎంతో మంది అల్యూమినియం పాత్రను కూడా ఉపయోగిస్తారు. మరికొందరు అయితే స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా వంట చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇత్తడి, ఇనుము, మట్టి పాత్రలో కూడా ఆహారాన్ని వండుకునే వాళ్లు ఎంతో మంది గ్రామాల్లో ఉన్నారు. కానీ ఎలాంటి పాత్రలో వంటలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. అయితే కొన్ని రకాల లోహపు పాత్రలో ఆహారాన్ని వండటం వలన ఆరోగ్యం పై ఎంతో తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాగే రోజు టీ తాగే అలవాటు ఉన్నటువంటి వారు ఇత్తడి పాత్రలో చేసుకుని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహార అలవాట్లు వలన ఎన్నో మార్పులు వచ్చాయి. దీనికి తోడుగా ప్రస్తుతం అందరూ కూడా ఆహారాన్ని స్టీలు మరియు అల్యూమినియం పాత్రలోనే అధికంగా వండుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యల భారీల పడుతున్నారు. కానీ పూర్వం మాత్రం అధికంగా రాగి మరియు ఇత్తడి,మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు.అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినటం మాత్రమే కాక ఎటువంటి పాత్రను వాడుతున్నాం అనేది కూడా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అయితే క్యాన్సర్, గుండెపోటు లాంటి వ్యాధులకు ఈ పాత్రలు కూడా ముఖ్య కారణం అని అంటున్నారు నిపుణులు.

అయితే ఎంతో మందికి ప్రతిరోజు టీ తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది. మరి ఆ టీని కాస్త ఇత్తడి పాత్రలో చేసుకుని తాగితే రుచి మాత్రమే కాదు ఆరోగ్య నికి కూడా ఎంతో మంచిది అనే ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఇత్తడి పాత్రలో టీ ని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎంత గానో పెరుగుతుంది. దీనివలన వ్యాధిల తో పోరాడగల శక్తి మీకు లభిస్తుంది. అయితే ఇత్తడి పాత్రలు అనేవి మెలనిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీనిలో నీరు,పాలు, టీ తీసుకోవడం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక హానికరమైనయు యూవి కిరణాల నుండి కూడా చర్మాని ఎంతగానో రక్షిస్తుంది. అలాగే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు ముడతలు పోయి చర్మం ఎంతో ఆకర్షనీయంగా మారుతుంది.

Brass Vessel ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఇత్తడిలో ఉన్నటువంటి జింక్ రక్తాన్ని పెంచేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా ఎంతగానో శుద్ధి చేస్తుంది. దీంతో పాటుగా ఇత్తడి పాత్రలో ఆహారాన్ని వండుకొని తీసుకోవటం వలన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇతడి పాత్రలో వండిన ఆహారం తీసుకోవటం మరియు నీరు నిలువ చేసి తీసుకోవటం వలన ఆస్తమా మరియు శ్వాస కోస చికిత్సలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఇత్తడి పాత్రలో ఉండటం వలన ఆహారంలోకి జింక్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగేలా చేస్తుంది. అయితే ఇతడి పాత్రలో వండే ఆహారం 90% పోషకాలను కలిగి ఉంటుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది