Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి…!
Bad Cholesterol : ప్రస్తుతం చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అధిక కొలెస్ట్రాల్ ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి కారణాలు తినే ఆహారంపై అవగాహన లేకపోవడం.. ఈ మధ్యకాలంలో చాలామంది అధికంగా మటన్ తినడం, మద్యం సేవించడం లాంటివి చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మరింత పెరుగుతున్నాయి.. కావున ఇటితో ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే చలికాలంలో వ్యాయామం చేయడానికి అంతగా సుముఖంగా […]
ప్రధానాంశాలు:
Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి...!
Bad Cholesterol : ప్రస్తుతం చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అధిక కొలెస్ట్రాల్ ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి కారణాలు తినే ఆహారంపై అవగాహన లేకపోవడం.. ఈ మధ్యకాలంలో చాలామంది అధికంగా మటన్ తినడం, మద్యం సేవించడం లాంటివి చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మరింత పెరుగుతున్నాయి.. కావున ఇటితో ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే చలికాలంలో వ్యాయామం చేయడానికి అంతగా సుముఖంగా ఉండరు. అలాగే శరీరం విటమిన్ డి లోపిస్తూ ఉంటుంది. ఇది లిపిడ్ జీవక్రియను ఎఫెక్ట్ చేస్తుంది.చలికాలంలోబ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అధికం చేసుకోవడానికి ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ చాలా ముఖ్యం..
అయితే శీతాకాలంలో ఈ ఐదు ఆహారాలను తీసుకోవడం వలన మరింత ఉపయోగాలు పొందవచ్చు. ఉదయం పూట అల్పాహారం కోసం ఓట్ మిల్లు తీసుకోవాలి. దీనిలోని పీచు పదార్థం చెడు లేదా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలలో ఫైబర్ రిచ్ ఫుడ్ ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ నివారించడానికి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం చాలా అవసరం. డ్రైఫ్రూట్స్ లో మల్టీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే అత్తిపండ్లను, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే అవకాడలో మోనో శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి… కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్న వారు ఒమేగా త్రీ ఫ్యాటియాసిడ్ లుఎక్కువగా ఉండే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చియా విత్తనాలు, సముద్రపు ఆహారం, వాల్ నట్స్,అవిసె గింజలు లాంటి ఆహారాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ కాలంలో బీట్రూట్, ముల్లంగి, పాలకూర మొదలైన కూరగాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, దుంపలు, క్యారెట్లు బీన్స్, క్యాబేజీ ఈ రకమైన కూరగాయలు లభిస్తాయి. కావున ఈ కూరగాయల్ని ఈ కాలంలో తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి సహాయంగా ఉంటాయి…