Knee Pains : 20 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? దానికి ఇది ఒక్కటే మార్గం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Knee Pains : 20 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? దానికి ఇది ఒక్కటే మార్గం..!!

Knee Pains : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్ల వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. పూర్వకాలంలో పెద్దలు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనడాన్ని మనం వింటుండే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పులు వస్తే ఎక్కువ దూరం నడవలేరు. వారి పనులను వారు చేసుకోలేరు. ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Knee Pains : 20 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? దానికి ఇది ఒక్కటే మార్గం..!!

Knee Pains : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్ల వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. పూర్వకాలంలో పెద్దలు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనడాన్ని మనం వింటుండే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పులు వస్తే ఎక్కువ దూరం నడవలేరు. వారి పనులను వారు చేసుకోలేరు. ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఒక్క చిన్న చిట్కాను ఉపయోగించి మనం మోకాళ్ళ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. రెండు నుండి మూడు రోజుల్లోనే మనం మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచే బయటపడవచ్చు.

దీనిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అదేంటో తెలుసుకుందాం. ఒక గిన్నెలో పసుపును తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పంచదారను పొడిగా చేసి వేసుకోవాలి. ఇందులోనే ఆకువక్కలను తినడానికి ఉపయోగించేస్తున్న సున్నము వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. పసుపు సున్నాన్ని కలపడం వల్ల ఈ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది.

ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై రాసుకొని వేడిగా ఉండేలాగా మోకాళ్ళ చుట్టూ వస్త్రాన్ని కట్టుకోవాలి. ఉదయం లేవగానే ఈ పార్టీని తీసివేసి నీళ్లతో మోకాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. చిన్న చిట్కాలు ఉపయోగించడం వల్ల ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు… లేని వారు కూడా అప్లై చేసుకుంటే ఇక జీవితంలో మోకాళ్ళ నొప్పులు అనేవి రావు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది