Bitter Guard : మంచిదే కదా అని కాకరకాయ ఎక్కువగా తింటే.. ఈ వ్యాధుల వల్ల కాస్త జాగ్రత్త..!
ప్రధానాంశాలు:
Bitter Guard : మంచిదే కదా అని కాకరకాయ ఎక్కువగా తింటే.. ఈ వ్యాధుల వల్ల కాస్త జాగ్రత్త..!
Bitter Guard : కూరగాయల్లో ఎక్కువ ఔషధ గుణాలున్న వాటిల్లో కాకరకాయ ఒకటి. అందుకే అది చేదుగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కదా అని దాన్ని అందరు తింటారు. ఐతే రుచిలో చేదైనా కూడా ఎన్నో సమస్యలకు కాకరకాయ ఔషధంగా పనిచేస్తుంది. అందుకే కాకరకాయ తినని వాళ్లని తినమని చెబుతుంటారు. ఐతే తినమన్నారు కదా అని అతిగా కాకరకాయ తిన్నా కూడా మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ ఎక్కువ ఎవరు తినకూడదు అన్నది ఇప్పుడు చూద్దాం. టైప్ 1 డయాబెటిస్ పేషంట్స్ కారకాయ రసాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాహిని పెంచే కాకర జ్యూస్ వారికి మంచి ఫలితాలు ఇవ్వదు. అందుకే షుగర్ ఉన్న వారు ఆ జ్యూస్ తాగితే వెంటనే సిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గర్భిణి స్త్రీలు కూడా ఎక్కువ కాకర జ్యూస్, కాకరకాయ తినకుండా వుంటే బెటర్. వేడి ప్రభావం వల్ల గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రగ్నన్సీ లేడీస్ కాకరకాయ తినకుండా ఉండాలంటారు.
Bitter Guard కిడ్నీలో రాళ్లు ఉన్న వారు..
కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కూడా కాకరకాయ ని ఎక్కువగా తినకూడదు. కాకర లోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను ఇబ్బంది పెడతాయి. అందుకే రాళ్ల సమస్య ఉన్న వారు కాకరకాయ అవైడ్ చేయడం మంచిది. కాకరకాయ ఎంత మంచిదో ఇలాంటి వ్యాధులున్న వారికి చెడు ప్రభావం చూపిస్తుంది.
కాకరకాయ లోని చేదుని తగ్గించడం కోసం చాలా ఇబ్బంది పడతారు. కాకరకాయని సరిగా ఉడికించడం వల్ల చేదు పోతుంది. సగం ఉడికిస్తే మాత్రం ఆ చేదు అలానే ఉంటుంది. చేదు కావాలని ఉంచుకున్న వారికి పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు లేకపోతే ఏమి కాదు కానీ అలా కాకుండా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం కష్టమే