Cranberry : క్రాన్ బెర్రీస్ లో ఎన్నో ఔషధ గుణాలు… ఈ సమస్యలన్నీ మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cranberry : క్రాన్ బెర్రీస్ లో ఎన్నో ఔషధ గుణాలు… ఈ సమస్యలన్నీ మాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Cranberry : క్రాన్ బెర్రీస్ లో ఎన్నో ఔషధ గుణాలు... ఈ సమస్యలన్నీ మాయం...!

Cranberry : క్రాన్ బెర్రీస్ అనేవి చాలా చిన్నగాను మరియు గుండ్రంగానూ ఉంటాయి. ఇవి ఎరుపు రంగులోనే ఉంటాయి. ఇవి రుచిలో కాస్త వగరుగా మరియు పులుపుగా ఉంటుంది. వీటిలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉన్నాయి. క్రాన్ బెర్రీస్ హీథర్ అనే కుటుంబానికి చెందినవి. అయితే ఇది బ్లూ బెర్రీస్ మరియు లింగన్ బెర్రీలకు సంబంధించినవి. దీనిలో ఫైటో న్యూట్రియంట్లతో ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి అనేవి ఆల్ రౌండ్ వెల్ నెస్ కు చాలా అవసరం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రాన్ బెర్రీ లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ కొల్లాజెన్ అనేది చర్మానికి నిర్మాణం మరియు స్థితిస్థాపకతను అందించటంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే దృఢమైన, మృదువుగా ఉండే చర్మాన్ని నిర్వహించేందుకు తగినంత కొల్లాజెన్ ఉత్పత్తి అనేది ఎంతో అవసరం. ఈ క్రాన్ బెర్రీ అనేది ఆరోగ్యానికి మాత్రమే కాక చర్మ న్ని రక్షించటంలో కూడా సహాయపడుతుంది.

అయితే ఎరుపు రంగు క్రాన్ బెర్రీ జ్యూస్ లో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ క్రాన్ బేర్రీలు మొటిమలను నియంత్రించడంలో మరియు చర్మాన్ని మెరిసేలా చేయటంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా నియంత్రిస్తుంది. ఈ క్రాన్ బెర్రీ లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు చర్మం యొక్క మంటను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ కొల్లాజెన్ పెంచడం వలన క్రాన్ బర్రీలు చర్మం యొక్క స్థితిస్థాపకత మరియు మృదువైన ఛాయ కు ఎంత దోహదం చేస్తుంది.అయితే ఈ క్రాన్ బెర్రీలు అనేవి యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇది దంతాల క్యావిటీస్ మరియు యూరినరీ ట్రక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇన్ ప్లమెంటరీ సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఈ ఎండిన క్రాన్ బెర్రీస్ చాలా విటమిన్లు కలిగి ఉంటాయి. ఇవి కాల్షియం మరియు పొటాషియం లాంటి ఇతర ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఈ క్రాన్ బెర్రీలను మన రోజువారి ఆహారంలో తీసుకోవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Cranberry క్రాన్ బెర్రీస్ లో ఎన్నో ఔషధ గుణాలు ఈ సమస్యలన్నీ మాయం

Cranberry : క్రాన్ బెర్రీస్ లో ఎన్నో ఔషధ గుణాలు… ఈ సమస్యలన్నీ మాయం…!

ఈ క్రాన్ బెర్రీ లో నీటి శాతం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఇవి చర్మాన్ని కూడా హండ్రెడ్ గా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే హైడ్రేటెడ్ చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ క్రాన్ బెర్రీస్ అనేవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మొటిమలు మరియు విరోచనాలను కూడా నియంత్రించగలవు. అయితే మన చర్మం ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియా,చర్మ రంధ్రాలను కూడా మూసుకొని పోయేలా చేస్తుంది. దీనివలన మొటిమలు అనేవి వస్తాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియ సమ్మేళనాలు, బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ప్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే క్రాన్ బెర్రీ సీడ్ ఆయిల్ లను డైరెక్టుగా చర్మానికి అప్లై చేసుకోవచ్చు. ఇది చర్మాని మాయిశ్చరైజ్ చేసేందుకు, ఫైన్ లైన్లను నియంత్రించటానికి మరియు సహజమైన మెరుపును ఇవ్వడానికి సహాయం చేస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది