Goat Milk : మేకపాలతో డెంగ్యూను నివారించవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Goat Milk : మేకపాలతో డెంగ్యూను నివారించవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…??

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Goat Milk : మేకపాలతో డెంగ్యూను నివారించవచ్చా... నిపుణులు ఏమంటున్నారంటే...??

Goat Milk : ప్రస్తుత కాలంలో డెంగ్యూ కేసులనేవి నానాటికి బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఏటా కొన్ని వేల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. అయితే వీరు కోలుకోవడానికి సరైన ఆహారమే కీలకము అని నిపుణులు అంటున్నారు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,మేకపాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఆవు పాలు లాగే మేకపాలు తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పోషక గుణాలు అనేవి ఎక్కువగా ఉండే ఈ పాలను తాగడం వలన పలు రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ మేకపాలలో ప్రోటీన్ మరియు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ మేక పాలల్లో అమినోయాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు సక్రమంగా లభిస్తాయి. ఇవి ఆవు పాలల్లో కంటే కూడా అవసరమైన ప్రోటీన్లు మరియు తక్కువ లాక్టోస్ ఉంటాయి. దీని కారణం చేత ఈజీగా జీర్ణం అవుతుంది.

ఒక కప్పు మేకపాలను తాగడం వలన 30% వరకు పాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ మేక పాలల్లో ఉండే బయోఆర్గానిక్ సోడియం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే కణాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఈ పాలను తాగటం వలన రోగనిరోధక శక్తి కూడా ఎంతో పెరుగుతుంది. అలాగే మీరు ప్రతినిత్యం మేకపాలను తాగడం వలన రక్తపోటు తగ్గుతుంది. అలాగే జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలాగే డెంగ్యూ సోకిన వారిలో రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య అనేది బాగా తగ్గిపోతుంటుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడే వారికి మేకపాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు. కానీ డెంగ్యూ చికిత్సతో దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇది శరీరానికి అవసరమైన పోషణ ను అందిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ పాలు అనేవి ప్లేట్ లైట్స్ ను పెంచడంలో మరియు డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని తగ్గించటంలో సహాయ పడదు…

Goat Milk మేకపాలతో డెంగ్యూను నివారించవచ్చా నిపుణులు ఏమంటున్నారంటే

Goat Milk : మేకపాలతో డెంగ్యూను నివారించవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…??

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. అలాగే డెంగ్యూ దోమ కుట్టడం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది. ఇకపోతే ఈ దోమ అనేది కుట్టిన తర్వాత విపరీతమైన జ్వరం మరియు తలనొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలు ఎన్నో కనిపిస్తాయి. అయితే ఈ డెంగ్యూకి ఉత్తమమైన చికిత్స ఫ్లూయిడ్ థేరపి అని అంటున్నారు నిపుణులు. అయితే వీరు వీలైనంత ఎక్కువ ద్రావణాన్ని మరియు ors ను తాగాలి అని అంటారు. ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యతను రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ టైంలో వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అవసరం అని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది