Goat Milk Benefits : ఛీ ఛీ.. మేకపాలా… మాకొద్దు బాబో అనేవారు… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?
ప్రధానాంశాలు:
Goat Milk Benefits : ఛీ ఛీ.. మేకపాలా... మాకొద్దు బాబో అనేవారు... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది...?
Goat Milk Benefits : ప్రతి ఒక్కరు కూడా పాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది.గేదె పాలు, ఆవు పాలు.ఈ రెండు ఎక్కువగా అందరూ ఇష్టంగా తాగుతారు. అలాగే గాడిద పాలు కూడా ఉంటాయి ఇవి కూడా చాలా ఆరోగ్యం. గాడిద పాలను ఎక్కువ రేటు పెట్టి కొంటూ తాగుతుంటారు. ఒకటి గ్లాస్ పాలు ఎంతో రేటు పెట్టి కొంటూ ఉంటారు. కానీ మేకపాలను మాత్రం అస్సలు తాగరు. గాడిద పాలు అయినా తాగుతారేమో కానీ, మేకపాలు అనేసరికి మాకొద్దు అని చీప్ గా చూస్తారు. మేక పాలు మేక వాసన వస్తాయి అని కొందరు చేయకూడతారు. మరికొందరు మేక పాలతో టీ ని కూడా చేసుకుని తాగుతారు. ఇదేమైనా కానీ మేకపాలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవు పాలక కంటే కూడా మేకపాలు ఎంతో శ్రేష్టం. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంటున్నారు నిపుణులు మరి దీని లాభాలు ఏమిటో తెలుసుకుందాం. మేక పాలలో కరకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇందులో కాల్షియం విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి కాబట్టి ఈ పాలు తాగితే అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. అంటువ్యాధులను దూరం చేస్తుంది. మేకపాలు సులభంగా జీర్ణమవుతాయి తక్కువ అలర్జీ కారకాలను కలిగి ఉంటుంది. దీనిలో ఇది ఒక ప్రత్యేకత. ఆవు, గేదె పాలు కంటే కూడా ఎక్కువ శ్రేష్టం,అని ఎందుకు అంటారంటే… మేక అడవుల్లోని వనమూలికలు కలిగిన ఆకులను ఎక్కువగా తింటుంది. ఆయుర్వేద వనమూలికలు కలిగిన ఆకులను తినడం వలన దానికి ఆరోగ్యం పెరుగుతుంది. ఆలాంటి ఆకులను తిన్న మేక పాలు తాగితే మనకు ఆ పోషకాలు లభిస్తాయి. కాబట్టి,మేకపాలు శ్రేష్టం.

Goat Milk Benefits : ఛీ ఛీ.. మేకపాలా… మాకొద్దు బాబో అనేవారు… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?
Goat Milk Benefits మేకపాలు త్వరగా జీర్ణం అవుతాయి
ఈ పాలలో ఉండే కొవ్వు గోళాలు చిన్న పరిమాణంలో ఉండడం వలన,శరీరం దానిని సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుంది. ఇది కడుపులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తుంది.
లాక్టోస్ తక్కువగా ఉంటుంది : పాలలో లాక్టోస్ శాంతం ఎక్కువగా ఉండటం వల్ల, కొంతమంది పాలు తాగడానికి సంకోచిస్తారు.కానీ మేకపాలలో లాక్టోస్ తక్కువగా ఉంటుంది.కాబట్టి,లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది : ఈ పాలలో సెలీనియం, జింక్, విటమిన్లు, ఏ, సి లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
చర్మ ఆరోగ్యం : ఈ పాలలో ఆల్ఫా హైడ్రాక్సి ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి, చర్మకాంతి సంరక్షణకు ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహకరిస్తుంది.
హార్మోన్ల మార్పులకు సహకరించడం : మహిళలలో హార్మోన్ల మార్పులను సమతుల్యం చేయడానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది.
మెదడుకు పోషణ : మేక పాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మెదడు అభివృద్ధికి జ్ఞాపకశక్తికి బాగా ఉపకరిస్తుంది.
కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది : మేక పాలు ఎముకలకు బలాన్ని అందిస్తుంది.ఆస్టియోపోరోసిస్ వంటి శరీర సమస్యలను నివారిస్తుంది.
శోద నిరోధక లక్షణాలు : ఏకపాలలో శరీరంలోని మంటను తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది ఇది పిట్ట సమస్యలను తగ్గిస్తుంది.
మేకపాలలో ఎక్కువగా కాల్షియం, విటమిన్ ఏ, బి6 లు ఉంటాయి. వీటిని తాగితే ఎముకల ఆరోగ్యం కుదుటపడుతుంది.దీనిని తీసుకుంటే వాపు కూడా తగ్గుతుంది.ఆందోళన తగ్గుతుంది. రక్తహీనత సమస్యకు పరిష్కారం కలుగుతుంది.కాబట్టి, మేకపాలు తాగడానికి ప్రయత్నం చేయండి.