Dates : ఖర్జూరంలో దాగివున్న ఆరోగ్య రహస్యాలు… అందుకే ముస్లిమ్స్ రంజాన్ మాసంలో తింటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dates : ఖర్జూరంలో దాగివున్న ఆరోగ్య రహస్యాలు… అందుకే ముస్లిమ్స్ రంజాన్ మాసంలో తింటారు…!

Dates : ఖర్జూరం ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఉరుతాయి. ఈ ఖర్జూర పండు ఎండిన కూడా రుచిగానే ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఖర్జూరాలు రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తి ఫుడ్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఖర్జూరంలో దాగున్న మరిన్ని ప్రయోజనాల […]

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Dates : ఖర్జూరంలో దాగివున్న ఆరోగ్య రహస్యాలు... అందుకే ముస్లిమ్స్ రంజాన్ మాసంలో తింటారు...!

Dates : ఖర్జూరం ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఉరుతాయి. ఈ ఖర్జూర పండు ఎండిన కూడా రుచిగానే ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఖర్జూరాలు రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తి ఫుడ్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఖర్జూరంలో దాగున్న మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఖర్జూరాలను చాక్లెట్లు, సిరప్, పాయసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో తేమ ఎక్కువ తీపి తక్కువగా ఉంటుంది. రెండో రకం కొద్దిగా ఎండినవి ఇందులో తేమ తక్కువ తీపి ఎక్కువ..

ఈ ఖర్జూరం ఎండితే మరింత తీయగా ఉంటుంది. ఖర్జూరాల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు పక్షవాతం వంటివి కూడా తగుముఖం పడతాయి. అంతేకాదు మూతల పిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూర పండు తరచుగా తినాలంటున్నారు. పోషకాహార నిపుణులు కంటి చూపు మెరుగవుతుంది. పెద్ద పేగులోని సమస్యలు తగ్గుతాయి. ఈ ఖర్జూరంలో ఐరన్ ఇతర విటమిన్స్ అధికంగా ఉండడం వల్ల ఇది జుట్టు రాలడం తగ్గించి పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పెంచేందుకు తోడ్పడుతుంది. కాబట్టి రోజు వారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎంతో ఇష్టంగా తినే ఈ ఖర్జూరాలను ప్రాసెసింగ్ ద్వారా చక్కెర జల్లి జ్యూస్ సిరప్ గా మార్చి విక్రయిస్తున్నారు. అలాంటివి తీసుకోకుండా వీటిని చెక్ చేసి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

రక్తహీనత ఎక్కువగా ఉండటం వల్ల వారు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, పొటాషియం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాపర్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు వృద్దులు ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజన కార్యాన్ని కాకుండా చర్మ సౌందర్యానికి జుట్టు అందాన్ని మెరుగుపరచడానికి కూడా సహకరిస్తుంది… అందుకే ముస్లిమ్స్ ఉపవాసం ఉన్న సమయంలో ఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది