Diabetes : షుగర్‌ను అరికట్టే గింజలు.. ఇవి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్‌ను అరికట్టే గింజలు.. ఇవి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది

 Authored By pavan | The Telugu News | Updated on :26 February 2022,7:00 am

Diabetes : చక్కెర వ్యాధి అదే మధుమేహం ఉన్న వారు అన్నం తినకూడది వైద్యులు సూచిస్తుంటారు. అన్నంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని.. దానిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నం తినడం వద్దని అంటారు. రోజూ అన్నానికి బదులు జొన్న రొట్టె తినమని చెబుతారు. కానీ చాలా మంది వాటిని తినడానికి ఇష్ట పడరు. ఎప్పటి నుంచో అన్నం తినడమే అలవాటు కాబట్టి దానిని అంత త్వరగా వదిలి పెట్టలేరు. దీని వల్ల మధుమేహం తగ్గడం చాలా చాలా ఆలస్యం అవుతుంది.ఇలా రొట్టేలు తినలేని వారికి మిల్లెట్స్‌ తో అంటు కొర్రలు చాలా మంచి పరిష్కారం అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ర క్తంలో చక్కెరర స్థాయి అదుపులో ఉంచడంతో పాటు ఇది కండరాలు మరియు ఎముకల బలోపేత కోసం కీలకమైన పోషకాల యొక్క సాధారణ మూలం.

ఇందులో అత్యధిక మొత్తంలో ప్రోటీన్లు (12.5%) ఉంటాయి.ప్రోసో మిల్లెట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు దాని ప్రత్యేక లక్షణాల నుండి వస్తాయి. ఇందులో కార్బొహైడ్రేట్‌ మరియు కొవ్వు ఆమ్లాలు గణనీయమైన మొత్తంలో ఉంటాయి.కొర్రలలో విటమిన్‌ B 12 పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, నాడీ వ్యవస్థ యొక్క సాఫీగా పని చేయడానికి మరియు సాధారణంగా చర్మం మరియు జుట్టు పెరుగుదలకు మంచిది. ఫాక్స్ టైల్ మిల్లెట్ తో సహా ఆహారం గ్లైసెమిక్‌ నియంత్రణను మెరుగు పరుస్తుంది. మరియు టైప్‌-2 డయాబెటిస్‌ రోగుల్లో ఇన్సులిన్, కొలెస్ట్రాల్‌ మరియు ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌ లను తగ్గిస్తుంది. కొర్రలలో సహజ సిద్ధమైన ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

diabetes control seeds

diabetes control seeds

మరియు రెస్ట్‌ లెస్‌ సిండ్రోమ్ ను అదుపులో ఉంచుతుంది. దీని వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయిశరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుంది. జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. శరీరంలో జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచే జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. దాని వల్ల రోగ నిరోధఖ శక్తి పెరుగుతుంది. దీంతో పాటు సోయా చిక్కుళ్లు వంటి గింజలను పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. నాన బెట్టిన గింజలు ప్రతి కూరలోనూ కొంచెం తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది