Diabetes : డయాబెటిస్ వ్యాధిని తరిమికొట్టండి ఇలా..
Diabetes : ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారిని మాత్రమే డయాబెటిస్ సమస్య వేధించేంది. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్, తీసుకునే ఫుడ్ తదితర వాటి వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని ఈ వ్యాధి బాధిస్తోంది. దీనిని కంట్రోల్ చేసుకునేందుకు చాలా మంది అన్నం తినడాన్ని బాగా తగ్గించేస్తారు. ఎందుకంటే బియ్యంలో చెక్కర స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాన్ని తినరు. దీనికి బదులుగా సేంద్రీయ కొర్రలను తీసుకోవడం ఎంతో ఉత్తమం. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు వైద్యులు.
ఇది గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్స్, ఫైబర్, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత జనరేషన్ లో మారుతున్న జీవిన విధానం కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.ఈ సేంద్రీయ కొర్రలను క్రమం తప్పుకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. వేరే ఇతర ధాన్యాలతో పోల్చినప్పుడు సేంద్రీయ కొర్రలు మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. సేంద్రీయ బ్రౌన్ టాప్ మిల్లెట్ రైస్ లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి గొప్ప డిటాక్సి ఫైయర్ గానూ పనిచేస్తుంది.
Diabetes : రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక లాభాలు
పేగు కదలికలను నియంత్రించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను సైతం నివారిస్తుంది. ఇందులో నియాసిస్ ఉండటం వల్ల అది బీపీని కంట్రోల్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్, గ్యా్స్ట్రిక్ సమస్యలను నివారించేందుకు రొమ్ము క్యాన్సర్ ను జయించేందుకు వీటినే సిఫార్స్ చేస్తారు చాలా మంది వైద్యులు. ప్రస్తుత లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అనర్థాలను బ్రౌన్ టాప్ మిల్లెట్ రైస్ ద్వారా జయించవచ్చు. చాలా మంది వీటిపై అవగాహన లేకపోవడం వల్ల వీటిని తినరు. ఫలితంగా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతారు.