Diabetes : ఇదొక్క గ్లాస్ తాగితే చాలు.. జీవితంలో షుగర్ రమ్మన్నా రాదట!
Diabetes : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య మధుమేహం. దానినే డయాబెటిస్ అని కూడా అంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి పోవడంతో ఈ వ్యాధి వస్తోంది. ఇది వచ్చిన వ్యక్తులకు మరి కొన్ని అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం తెలిసిందే. అందుకే డయాబెటిస్ ను ప్రమాదకారిగా భావిస్తున్నారు వైద్యులు. అయితే… డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కెర ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెడతారు.
అన్నం కూడా తినకుండా నోరు కట్టేసుకుంటారు. అయితే.. మధుమేహం ఉన్న వారికి కాకరకాయ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్లు A, C, మరియు బీటా-కెరోటిన్, ఇనుము మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాకర కాయను ఆయుర్వేదంలో మంచి ఔషధంగా భావిస్తుంటారు. కాకర ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహం, చర్మ సమస్యలు, ఉబ్బసం మరియు కడుపు నొప్పి లాంటి సమస్యకు చక్కని పరిష్కారం కాకరకాయ.
కాకరకాయను అనేక ఇతర పేర్లతో పిలుస్తుంటారు. అవి:
కాకరకాయ
బాల్సమ్ ఆపిల్
బాల్సమ్ పియర్
కరేలా
కుగువా
కాకరకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ లాగా పని చేస్తాయి. మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం కణాలలోకి గ్లూకోజ్ ను ఎక్కువ మొత్తంలో చేరేలా చేయడం ద్వారా చక్కెర స్థాయులను తగ్గిస్తాయని చెబుతున్నాయి. ఆపై శరీరం దానిని ప్రాసెస్ చేయడంలో మరియు కాలేయం, కండరాలు, కొవ్వులో నిల్వ చేయడంలో సహాయ పడుతుంది. కాకర కాయలు శరీరం నిల్వ చేసే పోషకాలను గ్లూకోజ్ మార్చకుండా మరియు రక్తంలోకి విడుదల చేయకుండా నిరోధించవచ్చు. కొన్ని అధ్యయనాలు కాకర కాయ రక్తంలో చక్కెర మరియు A1c స్థాయిలను తగ్గించగలవని చెబుతున్నాయి.
మనం మామూలుగా కాకరకాయతో అనేక రకాల వంటలు చేస్తూ ఉంటాం. కూరలాగ, ఫ్రై వంటి అనేక రకాల వంటలు కాకరకాయతో చేస్తూ ఉంటాం. కానీ దీని రుచి వలన చాలా మంది నెలకు ఒకసారి వండుకోవడం కూడా చాలా తక్కువ. కానీ కనీసం వారంలో రెండుసార్లు కాకరకాయ తినడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంటాయి. మరియు డయాబెటిస్ లేని వారికి బోర్డర్‌లో ఉన్న వారికి అంటే తల్లిదండ్రులకు తమకు వారసత్వంగా వస్తుందని కంగారు పడే వారికి రాకుండా అడ్డుకోవడంలో సహాయ పడుతుంది. అలాగే కాకరకాయను జ్యూస్ రూపంలో ఉదయాన్నే తాగడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది.