Diabetes : మీకు బ్లడ్ షుగర్ ఉందా? బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఖచ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే?
Diabetes : మీకు బ్లడ్ షుగర్ ఉందా? బ్లడ్ షుగర్ ఉంటే చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డయాబెటిస్ ను ఎదుర్కునే వాళ్లలో చాలామంది బ్లడ్ షుగర్ బాధితులే.మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు.. తమ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల తమ రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అందులో ఎక్కువగా మసాలా దినుసులే ఉన్నాయి.అవి దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర. ఇవన్నీ సుగంధ ధ్రవ్యాలు.
వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాల్సిందే.దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వాటిలో యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తాయి.అలాగే.. పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. పసుపు మంచి యాంటిబయోటిక్ గా పనిచేస్తుంది. కాబట్టి.. పసుపును ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు.
Diabetes : ఈ సుగంధ ద్రవ్యాల వల్ల వచ్చే లాభాలు ఏంటి?
మెంతులు కూడా షుగర్ వ్యాధిగ్రస్థులకు చాలా మేలు చేస్తాయి. రోజూ ఒక టీస్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఆ నీటిని ఉదయమే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.జీలకర్ర శరీరంలో బ్లడ్ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే.. బరువు తగ్గడానికి కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. అందుకే.. ప్రతి కూరలో జీలకర్రను ఖచ్చితంగా వాడుతారు.