Diabetes : డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే… తిన్న తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు…
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీ దినచర్యలో ఒక చిన్న పనిని చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. కానీ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వలన రక్తంలో గ్లూకోస్ మొత్తం పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి టాబ్లెట్స్ తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, ఆహారాన్ని నియంత్రించడం వంటివి చేయాలి.
దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. షుగర్ సమస్య ఉంటే దాన్ని అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. అయితే రోజు కొద్దిసేపు నడవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోస్ పెరుగుతుంది. మన ఏదైనా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటే కార్బోహైడ్రేట్ల నుంచి తయారయ్యే శక్తి ఉపయోగించబడదు. చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఆహారం తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
అలాగే శారీరక వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారం చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు అధిక గ్లైసమిక్ ఇంటెక్స్ ఉన్న వాటిని తినకూడదు. పుచ్చకాయ, ద్రాక్ష, అరటిపండు వంటి వాటిలో అధిక గ్లైసిమిక్ ఉంటుంది. బియ్యం, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అస్సలు తినకూడదు. శీతల పానీయాలు, బ్రెడ్ తో చేసిన వాటిని తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు కీవీ , రేగుపండ్లను తినడం మంచిది. తీపి పదార్థాలు పూర్తిగా తినడం మానేయాలి. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ ఆయిల్, స్పైసీ ఫుడ్లను తినకూడదు.