Health Tips : మీకు ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగే అలవాటు ఉందా..? దాంతో అద్భుతమైన ఉపయోగాలు ఎన్నో…!!
Health Tips : మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు.. వేసవికాలం వచ్చేసింది. ఇప్పుడు మనిషికి నీరు చాలా అవసరం పడుతుంది. చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతూ ఉంటారు. వేసవికాలంలో అయితే శరీరం నుండి నీటి పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సంభవిస్తుంది. శరీరానికి తగినంత నీరు చాలా ముఖ్యం. నీరు త్రాగడం […]
Health Tips : మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు.. వేసవికాలం వచ్చేసింది. ఇప్పుడు మనిషికి నీరు చాలా అవసరం పడుతుంది. చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతూ ఉంటారు. వేసవికాలంలో అయితే శరీరం నుండి నీటి పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సంభవిస్తుంది. శరీరానికి తగినంత నీరు చాలా ముఖ్యం. నీరు త్రాగడం వలన కలిగే లాభాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఉదయాన్నే నీరు త్రాగడం వలన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా.? అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
ఉదయాన్నే నీటిని తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు.. 1) బరువు తగ్గడం: ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగడం అలవాటు చేసుకుంటే అది జీవ క్రియను పెంచి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి.. 2) డిహైడ్రేషన్: రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటలపాటు నీరు అందకుండా పోతుంది. వేసవికాలంలో చాలామందికి నిద్ర పోయేటప్పుడు చెమట వస్తుంది. ఇది శరీరంలో నీటి కొరతను కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు తాగడానికి కారణం ఇదే.. 3) డల్ స్కిన్ నుంచి ఉపశమనం:
మీ చర్మం డల్లుగా మారినట్లయితే నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని నీటిని త్రాగడం ఎందుకంటే ఇది రక్త ప్రసరణ ప్రోత్సహిస్తుంది. కొత్త కణాలు ఉత్పత్తిని పెంచడం వలన చర్మాన్ని మెరిసేలా చేస్తూ ఉంటుంది. 4) కిడ్నీలలో రాళ్లకు చెక్.. ఉదయం పూట మొదటగా నీళ్లు తాగడం వలన కిడ్నీలోని రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ శాంతపరచి రాళ్ల అభివృద్ధిని తగ్గిస్తుంది.. 5) రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది: ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల కడుపు నుంచి విషాన్ని బయటికి పంపిస్తుంది. ఇది సోషసర వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కాలక్రమేనా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మనిషిని మళ్లీ అనారోగ్యానికి గురి చేసే సమస్య నుంచి రక్షిస్తుంది.