Turmeric : బొడ్డులో పసుపు రాస్తే ఏం జరుగుతుందో తెలుసా …?
Turmeric : బొడ్డులో నూనె రాయడం చాలా పాత పద్ధతి. నాభిలో నూనె రాసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే బొడ్డు మన శరీరానికి కేంద్రబిందువు మరియు మన శరీరంలో అనేక నరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. అయితే బొడ్డులో నూనెకు బదులుగా పసుపు కూడా రాసుకోవచ్చు. బొడ్డులో పసుపు రాయడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.
పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకునే ముందు పసుపును బొడ్డులో రాయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియాలు నుండి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో పసుపుని బొడ్డులో రాయడం వలన అనేక వైరల్ వ్యాధులు మరియు జలుబును నయం చేయడంలో సహాయపడుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణం, మలబద్ధకం వలన వాపు వచ్చినప్పుడు బొడ్డులో పసుపు రాయడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో పసుపు కలిపి నాభిలో రాయడం వలన కడుపునొప్పి, వాపు సమస్య దూరం అవుతుంది. పీరియడ్స్ సమయంలో స్త్రీలకు నొప్పి మరియు తిమ్మిరి సమస్య ఉంటుంది. ఆ సమయంలో నాభిలో పసుపు రాయడం వలన ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలు ఉంటే నాభిలో పసుపు రాయడం వలన ఫలితం ఉంటుంది. పసుపులో కూడా పీచు పదార్థం ఉంటుంది. దీనివల్లను జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.