Tea : బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు .. నెల రోజులు ఈ టీ తాగితే చాలు .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు .. నెల రోజులు ఈ టీ తాగితే చాలు ..

 Authored By aruna | The Telugu News | Updated on :22 September 2023,4:00 pm

Tea : ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అధిక బరువు ఉన్నవారు కడుపు మాడ్చుకొని ఉపవాసాలు ఉండకుండా వీటిని తీసుకోవచ్చు. ఈ టీ వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు స్లిమ్మింగ్ టీ ని ట్రై చేయవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ వంటి చైనీస్ టీ లను స్లిమ్మింగ్ టీ అని అంటారు. వీటి రుచి ఇష్టపడని వారు రెండు రకాల టీలను కలిపి తీసుకోవచ్చు. అయితే అలా తీసుకున్నప్పుడు జాగ్రత్తలు వహించాలి.

స్లిమ్మింగ్ టీ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ప్రక్రియను రెట్టింపు చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది. కడుపులో హానికరమైన టాక్సీన్ లను బయటకి పంపించడానికి సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా త్రాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది . ఈ టీలను కొనుగోలు చేసేటప్పుడు అందులోని మిళిత పదార్థాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ టీల వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

drink this tea a month for weight loss

drink this tea a month for weight loss

సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఈ టీలను తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, వ్యాధిగ్రస్తులు ఈ టీలకు దూరంగా ఉండాలి. ఒకవేళ త్రాగాలి అనుకుంటే వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలని అధిక మొత్తంలో ఈ టీ లను తీసుకుంటే నష్టాలు వస్తాయి. రోజుకు ఒకటి రెండు కప్పుల టీని మాత్రమే తీసుకోవాలి. ఈ టీ ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. ఆహారం తగినంత తీసుకుంటూ వ్యాయామం వంటివి కూడా చేయాలి. వేగంగా నడవడం, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం డాన్స్ చేయడం వంటివి శారీరక శ్రమకు తోడ్పడి బరువు తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది