Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా… అయితే, ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా… అయితే, ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా... అయితే, ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదమే...?

Drink Warm Water : పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఏదైనా అతిగా తాగితే ఆరోగ్యానికి హానికరమే అంటున్న నిపుణులు.వేడి నీళ్లు ఆరోగ్యంగా ఉన్నవారికి మంచిదే. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం ఈ గోరువెచ్చని నీరు ఉదయం పరగడుపున తాగకుండా ఉంటేనే మంచిది. ఉదయాన్నే పరగడుపున కొందరు గోరువెచ్చని నీరు తాగండి ఏ పని అయినా చేయరు. ఉదయం లేవగానే టీ ఎలా అయితే తాగుతారో. మొదట గోరువెచ్చని నీటిని కూడా అదే విధంగా తాగుతారు. గోరువెచ్చని నీరు పరగడుపున తాగటం వలన, కడుపుని శుభ్రపరుస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీళ్లు అతిగా తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారికి పరగడుపున వేడి నీళ్లు తాగితే కొన్ని సమస్యలు తప్పవని చెబుతున్నారు. మరి ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాం…

Drink Warm Water ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా అయితే ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదమే

Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా… అయితే, ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదమే…?

Drink Warm Water ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉదయం వెచ్చని నీరు తాగకూడదు

కడుపులో పుండ్లు : నీకు కడుపులో పుండ్లు ఏర్పడినట్లయితే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం మంచిది కాదు. కడుపులో అధికంగా ఆమ్లం ఏర్పడడం వల్ల, కడుపు, పేగుల లోపల గోడపై గాయం ఏర్పడుతుంది. నేనే అల్సర్ అంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారు వేడి నీరు తాగితే కడుపులో చికాకు, నొప్పి కలిగిస్తుంది. వేడినీరు కడుపులోని ఆమ్లంతో చర్య జరిపి, వాపు, చికాకును కలిగిస్తుంది. దీంతో పుండు మరింత పెరిగి నొప్పి పెరుగుతుంది.

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి (Gerd ) : ఈ సమస్య కడుపులోని ఆమ్లం అన్నవాహికలో తిరిగి ప్రవహించే సమస్య. కడుపులోని చికాకును కలిగిస్తుంది. గోరువెచ్చ నీటిని తాగితే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రిప్లెక్స్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నొప్పిని కలిగిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగితే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య మరింత దైవము అవుతుంది.

విరేచనాలు : తరచూ మోషన్స్ అయ్యేవారు, వెచ్చని నీటిని తాగడం వలన కడుపు, పేగులలో అధికచుకాక ఉంటుంది. దిని వల్ల డయేరియా సమస్య పెరుగుతుంది. వేడి నీరు తాగితే శరీర జీవక్రియ, ప్రేగు కదలికలు మరింత వేగవంతం అవుతాయి . అతి సార పరిస్థితిని మరింత తీవ్రం చేయగలదు. దీనివల్ల శరీరంలో నీరు, ఖనిజాలు కూడా లోపిస్తాయి. ఇలాంటి పరిస్థితి మీ ఆరోగ్యాన్ని మరింత దిగజారే ఎలా చేస్తుంది.

వేసవికాలంలో : వేసవికాలంలో గోరువెచ్చని నీటిని ఉదయాన్నే పరుగడుపున తాగితే, శరీరంలో లోపల వేడి పెరుగుతుంది. ఇప్పటికే అధిక వేడి లేదా వడదెబ్బ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే, గనుక నీరు తాగటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. గోరువెచ్చని నీటితో శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు. దీనివల్ల అలసట, తలనొప్పి, తల తిరుగుడు వంటివి వస్తాయి.

మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు : శరీరంలో ఖనిజాలు ఒకేచోట పేరుకుపోయి గణపదార్థాలుగా మారితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో వేడి నీళ్లు తాగితే శరీరంలో ఖనిజా అసమతుల్యత ఏర్పడుతుంది. అప్పటికే, కిడ్నీలలో రాళ్ల సమస్య ఉన్నవారు అతిగా వేడి నీళ్లు తాగితే, రాళ్లతో పాటు మంట లేదా నొప్పి వస్తుంది. దీనివల్ల రాయి పరిమాణం మరింత పెద్దగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది