Health Tips : ఉదయం నుండి రాత్రి వరకు ఏయే పండ్లు తినాలి..?
Health Tips : తాజా పండ్లను ఎక్కువగా తినాలని వైద్యులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా పండ్లను తీసుకోవాలని అంటారు. మన ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలని, ఫైబర్, పోషకాలు ఎక్కువుండే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. పండ్లను తినాలన్న ఆలోచన ప్రజల్లో ఉన్నప్పటికీ ఏ పండు తినాలి, ఎప్పుడు తినాలి అనే అవగాహన చాలా మందికి ఉండదు. ఏ పండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియదు.పండ్లలో […]
Health Tips : తాజా పండ్లను ఎక్కువగా తినాలని వైద్యులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా పండ్లను తీసుకోవాలని అంటారు. మన ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలని, ఫైబర్, పోషకాలు ఎక్కువుండే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. పండ్లను తినాలన్న ఆలోచన ప్రజల్లో ఉన్నప్పటికీ ఏ పండు తినాలి, ఎప్పుడు తినాలి అనే అవగాహన చాలా మందికి ఉండదు. ఏ పండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియదు.పండ్లలో సాధారణంగా ఖనిజాలు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజంతా చలాకీగా ఉండేందుకు.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి పండ్లు తినడం చాలా అవసరమని వైద్యులు చెబుతారు.
అందుకే రోజంతా ఒకే పండుతో సరిపెట్టకుండా… ఒక రోజులో వివిధ రకాల పండ్లను తీసుకోవాలని డాక్టర్లు పదే పదే సూచిస్తారు.
ఉదయాన్నే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ, అరటి పండు లాంటి తీసుకోవచ్చు. దీని వల్ల మల బద్ధకం దరిచేరదు. శరీరానికి కావాల్సిన పీచు అందించే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అల్పాహారానికి బదులు పండ్లను తినాలనుకుంటే.. పైనాపిల్, చెర్రీ, కివీ, స్ట్రాబెర్రీ, యాపిల్ వంటి వాటిని తీసుకోవాలి. యాపిల్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అనవసరమైన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని వైద్యులు చెబుతారు. చాలా మంది అల్పాహారంగా ఒక కప్పు పండ్లను తినడానికి ఇష్టపడతారు.
అందువల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారు.మధ్యాహ్న వేళ చక్కెర పండ్లను తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు. పగటి సమయంలో మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు రక్త ప్రసరణను మెరుగు పరిచేందుకు ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. అందుకే మధ్యాహ్నం సమయంలో అరటి పండు లేదా మామిడి వంటి వాటిని తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి వేళ పండ్లను తీసుకోవడం ఎంతో మంచిదట. కానీ పడుకునే ముందు పండ్లు తినొద్దు. కనీసం కొన్ని గంటల సమయం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. పైనాపిల్, అవకాడో, కివీ వంటి పండ్లు తినొచ్చు. ఈ పండ్లు రాత్రి సమయంలో తీసుకోవడానికి ఉత్తమమైన పండ్లు అని డాక్టర్లు సూచిస్తున్నారు.