Eat Ber Fruit : రేగుపండ్లను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eat Ber Fruit : రేగుపండ్లను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :3 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Eat Ber Fruit : రేగుపండ్లను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!!

Eat Ber Fruit : రేగుపండ్ల సీజన్ రానే వచ్చేసింది. ఇవి మార్కెట్లో మరియు రోడ్లు వెంట, తోపుడు బండ్లపై ఊరిస్తున్నాయి. ఈ రేగు పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్స్ సి జీవం కోల్పోయిన మోనీఛాయను మెరుగుపరిచి, మొటిమలు లేని అందమైన చర్మాన్ని ఇస్తుంది. అలాగే ఎండబెట్టిన రేగు పండ్లలో ఉండే కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముకల దృఢత్వానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ రేగు పండ్లల్లో ఉండే పీచు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక మలబద్ధకం మరియు అజీర్తి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ రేగు పండ్లలో ఉండే యాంటీ యాక్సిడెంట్ మరియు ఫైటో కెమికల్స్,పాలీశాచురైట్స్, ప్లేవనాయిడ్స్, సపోనిన్స్ లాంటివి నిద్రకు హెల్ప్ చేస్తాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలను కలిగి ఉండడం వలన రేగు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచివి. ప్రతిరోజు ఆహారంలో రేగుపండ్లను చేర్చుకోవడం వలన మలబద్ధక సమస్య తగ్గుతుంది…

Eat Ber Fruit రేగుపండ్లను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా

Eat Ber Fruit : రేగుపండ్లను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

రేగుపండ్ల శోథ నిరోధక చర్య కారణం చేత ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడమే కాక రక్తప్రసరణ ను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ రేగు పేస్ట్ ను చర్మం నికి పూయడం వలన గాయం మానడం తో పాటు చర్మం కూడా ఎంతో మృదువుగా మారుతుంది. రేగుపండ్లలో ఉండే యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వలన ఇవి ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షిస్తుంది. ఈ రేగుపండ్ల లో ఎన్నో ఔషధ పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ సి మరియు విటమిన్ ఏ, పొటాషియం లాంటివి ఎక్కువగా ఉన్నాయి.

రేగు పండ్లను తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివలన చాలా వ్యాధులను దూరం చేసుకోవచ్చు. రేగిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండడం వలన శరీరంలో వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు పోతాయి. అలాగే కాలేయం యొక్క పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ కారకాలు కూడా నయం అవుతాయి అని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న గొప్ప గుణాలు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులను కూడా నయం చేస్తాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది