Tomato : టమాటే కదా అని లాగిస్తున్నారా.. అయితే మీ పని ఇక అంతే..!!
Tomato : కొందరు టమాటా అని పడి చస్తారు. కూర ఏది అయినా అందులో టమాటా వేయాల్సిందే అని పట్టుబడతారు. అది వెజ్ అయినా నాన్- వెజ్ అయినా ఒక్క టమాటా అన్న వేసి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తారు. టామాటా ధరలు రూ. 10 లకు కిలో ఉన్న వాళ్ల ధోరణి అలాగే ఉంటుంది. రూ. 150 దాటినా వాళ్లు అలాగే పట్టు బడతారు. వద్దు అంటే ఊరుకోరు సరి కదా టమాటా వేస్తే బాగుంటుందనో.. రుచి వస్తుందనో ఇంకేదో కారణం చెబుతారు. అందులో చాలా మంది చెప్పే రీజన్ మాత్రం కర్రీ గ్రేవీ ఎక్కువ ఉంటుందని. అందుకే కూరగాయాల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక బయట హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, చిన్న చిన్న కిరాణాల దుకాణాల్లోనూ టమాటా సాస్ తప్పనిసరిగా దొరుకుతుంది.
కొందరు డైట్ మెయింటైన్ చేసే వారు పచ్చి టమాటాలను సన్నని ముక్కలుగా చేసుకుని లాగించేస్తుంటారు. టమాటాలతో పాటు ఇతర కూరగాయలనూ తీసుకుంటారు.టమాటాలను పరిమితికి మించి తినడం ఎప్పటికీ అనర్థ దాయకమేనని వైద్యులు చెబుతున్నారు. టమాటా వినియోగం ఎక్కువ అయ్యే కొద్దీ దాని నుంచి వచ్చి చెడు కూడా పెరిగిపోతుందని వివరిస్తున్నారు. మోతాదులో తింటే టమాటా ఎంత మేలు చేస్తుందో… విపరీతంగా తినడం మొదలు పెడితే దాని నుంచి అదే స్థాయిలో నష్టాలు వస్తాయని అంటున్నారు.టమాటాను ఎక్కువగా తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుందని, లేని వారికి కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టమాటాలో అగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది.
ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు అగ్జాలిన్ మన శరీరంలోని యూరిక్ యాసిడ్ తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అగ్జాలిన్ ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వల్ల కిడ్నీల్లో చిన్నగా రాళ్ల లాగా ఏర్పడుతాయని డాక్టర్లు వివరిస్తున్నారు. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం వల్ల మూత్రానికి అడ్డు పడతాయి. దాని వల్ల మూత్రం పోసే సమయంలో విపరీతమైన మంట వస్తుంది. రాళ్లు రంధ్రానికి అడ్డుగా ఉండటంతో మూత్రం కూడా సాఫీగా బయటకు రాలేదు. దీని వల్ల నొప్పి కూడా కలుగుతుంది.ఈ రాళ్ల లాంటి పదార్థాలను కిడ్నీలో నుంచి తొలగించకపోతే బాడీలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఇది ఇలాగే ఎక్కువ రోజులు బాధిస్తే.. కిడ్నీలే చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మూత్ర పిండాల వ్యాధితో బాధపడేవారు టమాటాను అత్యంత తక్కువగా తీసుకోవాలని, లేదా మొత్తానికే తీసుకోకపోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.