Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఏంటి…?దీనివలన ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?
ప్రధానాంశాలు:
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఏంటి...?దీనివలన ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?
Bad Cholesterol : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య చెడు కొలెస్ట్రాల్. ఈ సమస్య పెరగడం వలన గుండెపోటు ,బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రెండు కూడా ప్రాణాంతకరమైన వ్యాధులు. కానీ ప్రస్తుత కాలంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే సమస్య అతి చిన్న వయసు వారిలో కూడా కనిపించడం భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో నేటి కాలంలో గుండెపోటు కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నామని పెద్దవాళ్ళు మాత్రమే వచ్చేవారిని, కానీ ఇప్పుడు 20 నుండి 30 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
దీంతో చెడు కొలెస్ట్రాల్ బారిన పాడడానికి ముఖ్య కారణం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ…నేటి కాలంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణం ప్రజల అనారోగ్య జీవనశైలి , ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయకపోవడమే అని తెలిపారు. అయితే చాలా సందర్భాలలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు అనేవి చాలా ఆలస్యంగా గుర్తించబడతాయని ఇలాంటి సమయంలోనే పెరిగిన కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటుకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ జైన్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Bad Cholesterol కొలెస్ట్రాల్ ఎంత మోతాదులో ఉండాలి….
కొలెస్ట్రాల్ అనేది చాలా రకాలుగా ఉంటాయి అని డాక్టర్ జైన్ ఈ సందర్భంగా వివరించారు. దీనిలో అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ , అలాగే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటాయని ఆయన తెలియజేశారు. అయితే మానవ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 50mg/dl లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్ అనేది ఎల్లప్పుడూ 100mg/dl కంటే తక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ జైన్ సూచించారు.
Bad Cholesterol చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఏం జరుగుతుంది…
చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగడం వలన అది గుండె సిరల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయలేదు. తద్వారా గుండెపోటు వస్తుందని డాక్టర్ జైన్ వివరించారు. అయితే సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం , జీవనశైలిలో తగు మార్పులు చేసుకోవడం వలన దీనిని అదుపులో ఉంచుకోవచ్చట.
Bad Cholesterol చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి…
జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు…
స్వీట్స్ మితంగా తీసుకోవాలి.
శారీరకంగా చురుగ్గా ఉండటం అలవాటు చేసుకోవాలి.
తగినంత నిద్రపోవాలి…
ధూమపానం మద్యపానం తగ్గించుకోవాలి…
గమనిక…
పైన పేర్కొనబడిన కథనాన్ని వైద్య నిపుణులు అందించిన సలహాలు, సూచనల మేరకు రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.