Urinating : మూత్ర విసర్జన సమయంలో నురగ వస్తుందా.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే…!
Urinating : మూత్ర విసర్జనలో Urinating కొన్నిసార్లు నురగ రావడం అనేది సర్వసాధారణం. ఇలా తరచూ వస్తున్నట్లయితే అది తీవ్రమైన సమస్య అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లయితే అది తీవ్రమైన అనారోగ్య సమస్య. కాబట్టి ముందుగానే ఈ లక్షణాలను గుర్తించాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక మూత్రం రంగు మారడం , మూత్ర విసర్జన సమయంలో మంట రావడం మరియు నూరుగు రావడం వంటివి అనేక వ్యాధుల లక్షణాలు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం మూత్రంలో నురుగు రావడం అనేక వ్యాధులకు కారణమవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సవివరంగా వెల్లడించడం జరిగింది.
Urinating నురుగు మూత్రం కారకాలు
కిడ్నీ సమస్యలు: మూత్రంలో నురుగు వస్తే దానికి సంకేతం మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని అర్థం. మూత్రపిండ సమస్యలు కూడా నూరుకు ప్రధాన కారణం కావచ్చు.
మధుమేహం : మధుమేహం రోగులలో కూడా మూత్రంలో నురుగు కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అధిక మోతాదులో ఉన్నప్పుడు మూత్రంలో నురుగు ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా ప్రోస్టేట్ సమస్యల మూత్రంలో నురుగు కి కారణం అవ్వచ్చు.
మూత్రంలో నురుగు ఉంటే ఏ పరీక్షలు చేయించుకోవాలి..?
– మూత్రంలో గ్లూకోజ్ ప్రోటీన్ మరియు ఇతర కారకాలను తెలుసుకోవడం కోసం “మూత్ర పరీక్షలు ” చేయించుకోవాలి.
– మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడం కోసం ” రక్త పరీక్ష ” ను చేయించుకోవాలి.
” మైక్రోఅల్బుమిన్ ” పరీక్ష చేయించుకోవడం ద్వారా మూత్రంలో ప్రోటీన్లను తనిఖీ చేస్తుంది.
– మూత్ర నాళాలను మరియు మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడం కోసం ” అల్ట్రాసౌండ్ ” పరీక్ష చేయించుకోవాలి.
Urinating వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
మూత్ర విసర్జన సమయంలో తరచు నురుగు మంట , ముదురు పసుపు, ఎరుపు లేదా మరి ఏదైనా సాధారణ రంగులో రావడం మరియు మూత్ర విసర్జన చేసే సమయంలో అసౌకర్యంగా అనిపించడం నొప్పి లేదా వాపు వంటికి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.