Health Care Tips : వీటిని పాలతో కలిపి తీసుకుంటున్నారా.. ఇలా చేస్తే ఆరోగ్యానికి పెనుప్రమాదమే..?
Health Care Tips : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు పాలను ఇష్టపడుతుంటారు. కొందరు మాత్రం పాల వాసన చూడగానే మొహం తిప్పుకుంటారు. దాని వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిసాక అప్పుడు రియలైజ్ అవుతుంటారు. పాలల్లో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అన్నివేళలా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే వైద్యులు పాలు, పెరుగు కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. పాలతో తయారు చేసిన పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కొందరు పాలు తాగాక తెలిసో తెలియక కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు.
అలా చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..కొందరు పాలు తాగాక, టిఫిన్ లేదా స్నాక్స్ తీసుకుంటుంటారు. మరికొందరు ఏకంగా భోజనం చేస్తారు. అయితే, పాలు తీసుకున్నాక లేదా ఈ ఆహార పదార్థాలు తిన్నాక గానీ పాలు అస్సలు తీసుకోరాదట.. అందులో కూరగాయ ముల్లంగి ఒకటి.. ఇది పాలతో పాటు కలిపి తీసుకుంటే ఇందులోని పుల్లని దనం పాలను విషపూరితంగా మారుస్తుంది. ఫలితంగా చర్మవ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పప్పు వంటి పదార్థాలను కూడా తీసుకోరాదు. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాలల్లో ఉండే ప్రోటీన్స్, పప్పులోని ప్రోటీన్స్ అధికమవడంతో రసాయనికి చర్య జరిగి గుండెపోటుకు దారి తీయొచ్చు..
Health Care Tips : పాలతో ఇవి అస్సలు తీసుకోవద్దట..
పాలు లేదా పాల పదార్థాలు తీసుకున్నాక ఉప్ప అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోరాదు.. రాత్రి భోజనం చేశాక లేదా చేయకముందు ఇలా చేయొద్దు. సాల్ట్ చిప్స్, పెరుగు పదార్థాలు, పాప్ కార్న్ వంటి వాటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. ఇవి కూడా చర్మ సమస్యలకు కారణం కావొచ్చు. అంతేకాకుండా పుల్లని పండ్లు అయిన ద్రాక్ష, పైనాపిల్, నారింజ, స్టాబెర్రీ వంటి వాటిని కూడా పాలతో కలిపి తీసుకోరాదు. ఇవి కూడా శరీరంలో విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఫం సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం లేకపోలేదు.