Forgetting : వామ్మో మతిమరుపు వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారా… ఇకపై భయపడాల్సిన అవసరం లేదు… ఎందుకంటే…??
Forgetting : ప్రస్తుత కాలంలో మతిమరుపు అనేది సర్వసాధారణం. ఈ సమస్య ఉన్నవారు తరచుగా బాధపడుతూ ఉంటారు. కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే మతిమరుపు వస్తుందేమో అనే ఆందోళన కూడా అవసరం లేదు. ఎందుకు అంటే మతిమరుపు మంచిదే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే మన జీవితంలో కొత్త అంశాలను నేర్చుకునేందుకు మరియు మెమోరీని అప్డేట్ చేసుకునేందుకు జరిగే ప్రక్రియలో మతిమరుపు ఒక భాగం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. […]
ప్రధానాంశాలు:
Forgetting : వామ్మో మతిమరుపు వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారా... ఇకపై భయపడాల్సిన అవసరం లేదు... ఎందుకంటే...??
Forgetting : ప్రస్తుత కాలంలో మతిమరుపు అనేది సర్వసాధారణం. ఈ సమస్య ఉన్నవారు తరచుగా బాధపడుతూ ఉంటారు. కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే మతిమరుపు వస్తుందేమో అనే ఆందోళన కూడా అవసరం లేదు. ఎందుకు అంటే మతిమరుపు మంచిదే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే మన జీవితంలో కొత్త అంశాలను నేర్చుకునేందుకు మరియు మెమోరీని అప్డేట్ చేసుకునేందుకు జరిగే ప్రక్రియలో మతిమరుపు ఒక భాగం అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే మనిషి యొక్క మనుగడకు ఇది అత్యంత అవసరం అని తేల్చి చెప్తున్నారు. అలాగే ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ వేటాడి బతికేవారు. అలాగే దగ్గరలో ఉన్న చెరువుల నుండి నీళ్లు తెచ్చుకునేవారు. అంతేకాక మనుషులు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు సింహం మరియు పులి లాంటి క్రూర జంతువులు కనిపిస్తే ఆ ప్రాంతం ప్రమాదకరం అని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. అయితే ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని మరో చెరువును వెతుక్కోవాలి అని ప్రేరేపిస్తుంది. ఇది మానవ పరిమాణానికి తోడ్పడింది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన మెదడులోని కణాల మధ్య ఏర్పడే బంధాలు ఎంత దృఢంగా ఉంటాయో అక్కడ నిరీక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది.
ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో మరియు ఏకాగ్రతతో,ఇష్టంతో చేసినప్పుడు లేక ఒకే పనిని తరచుగా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ అంశానికి సంబంధించిన బంధాలు బలంగా ఏర్పడి అవి ఒక జ్ఞాపకం గా మారతాయి. అలాగే దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించే పని లేకుండా ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తమై ఉంటాయి. మనం దేని పైన అయినా సరిగ్గా శ్రద్ధ పెట్టకపోతే బంధాలు బలహీనంగా ఉండి జ్ఞాపకం సరిగా నమోదు కాదు. అలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగించేస్తుంది. దానినే మతిమరుపు అంటారు. అలాగే అక్కడ కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటారు. ఇలా ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త తన పరిశోధనలో ఈ విషయం గురించి తెలిపారు.