Hair Tips : తెల్లగా ఉన్న జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసే ఈ మొక్క గురించి తెలుసా?
Hair Tips : భింగ్రాజ్ లేదా గుంట గలగలగరాకు ఆయుల్ జుట్టు సమస్యలు వంటి వాటిని తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతీ ఒక్క నూనె తయారీలో ముఖ్యంగా ఆయుర్వేద నూనెల తయారీల్లోనూ భింగ్రాజ్ మూలికలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ హెర్బ్ ను ఫాల్స్ డైసీ అని కూడా అంటారు. ఈ ఔషధ మూలిక పొద్దు తిరుగుడు కుటుంబానికి చెందిన మొక్క మరియు భారత దేశం, థాయిలాండ్ మరియు బ్రెజిల్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది. భింగ్రాజ్ హెర్బ్ యొక్క ఆకులను రెండు మూడు రోజులు ఎండ బెట్టి.. ఆపై కొబ్బరి లేదా నువ్వుల నూనెలో కలుపుతారు. ఈ నూనెను దాని రంగు ఆకుపచ్చగా మారే వరకు మరో రెండు మూడు రోజులు ఎండలో ఉంచుతారు.
గంటగులగరాకులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటామిన్ డి, విటామిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ సూపర్ ఎఫెక్టివ్ హెర్బ్ ని ఎక్కువగా జుట్టు సమస్యలకు ఉపయోగిస్తారు.భింగ్రాజ్ నూనె నెత్తి మీద మరియు మూలాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా ఊఢిపోయే జుట్టును ఊడకుండా చేస్తుంది. భింగ్రాజ్ ఆయిల్ మీ తలను చల్లబరుస్తుంది. అలాగే ఒత్తిడి, భయాలను తొలగిస్తుంది. ఈ హెర్బ్ లో ఉండే ఖనిజాలు, విటామిన్ల వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ చుండ్ును తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అలాగే భింగ్రాజ్ నూనెలో క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. ఇవి అకాల బూడిద రంగు జుట్టును నివారించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే చర్మ ఇనఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భింగ్రాజ్ మొక్క ఆకుల రసాన్ని కాలేయానికి టానిక్ అంటారు. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దాని పని తీరును పెంచుతుంది. అలాగే నాసికా పరిపాలను, తల నొప్పిని నివారించడంలో భింగ్రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరచడానికి భింగ్రాజ్ నూనెను ఉపయోగిస్తారు. గుంటగలగరాకు స్ట్రెస్ రిలీవర్ అంటారు. ఇది మానసిక స్థితి మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. గుంటగలగరాకును అశ్వగంధతో కలిపినప్పుడు అల్జీమర్స్ వ్యాధిలో జ్ఞాపక శక్తిని మెరుగుపచడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.