Hair Tips : మీ జుట్టు అంటే మీకు మమకారం ఉన్నట్లయితే ఈ పొరపాట్లు చేయకండి…
Hair Tips : ఎవరికి జుట్టు అంటే ఇష్టం ఉండదు చెప్పండి.. అందరికీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. జుట్టుని చాలా ప్రేమగా చూసుకుంటూ రక్షించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న జీవనశైలి విధానంలో ఆహార మార్పులు వలన కాలుష్యం వలన జుట్టు సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. అయితే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేయడంవలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. కావున ఆరోగ్యకరమైన జుట్టు కొరకు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… తలకు కండీషనర్ వాడవద్దు.. షాంపూతో తలస్నానం చేసిన తదుపరి మీ జుట్టును కండిషనింగ్ చేయడం ప్రధానం కానీ ఏ విధంగా దానిని అప్లై చేయాలో తెలిసి ఉండాలి. కండిషనర్ ను ఎప్పుడు జుట్టుకి పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే కండీషనర్ స్కాల్పుకి చేరకుండా చూసుకోవాలి.
పదేపదే తలస్నానం చేయవద్దు… అతిగా షాంపూ చేయడం వలన మీ జుట్టుకు అధిక నష్టం కలుగుతుంది. షాంపులలో మీ స్కాల్పులోని సాధారణ నూనెను తొలగించే ఎన్నో కెమికల్స్ ఉంటాయి. దానివలన స్కాల్పు పొడిగా, నిస్తేజంగా, బలహీనంగా అయిపోతాయి. అదేవిధంగా తరచు షాంపూ చేయడం వలన జుట్టు ఊడిపోతుంది. అని వైద్యులు తెలియజేస్తున్నారు. వారానికి రెండుసార్లు తల స్నానం చేయడం మంచిది. హెయిర్ స్టైలింగ్ తగ్గించుకోవాలి.. జుట్టుని ఎన్నో రకాల స్టైల్స్ వేస్తూ ఉంటారు. ఈ స్టైల్స్ క్రమంలో వేడి ఎలక్ట్రానిక్స్ ను వాడుతూ ఉంటారు అలా వాడుతున్నట్లయితే జుట్టుపై పరిమాణాలను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలి. హీట్ ఎలక్ట్రానిక్ టూల్స్ మీ జుట్టుకి శత్రువు లాంటిది.
కావున హెయిర్ స్టైలింగ్ తగ్గించుకోవాలి. తరచుగా దువ్వెన చేయవద్దు.. జుట్టు బ్రష్ లేదా దువ్వెన తెలివిగా వినియోగించడం జుట్టుకి మంచిది. అయితే ప్రతి గంటకు జుట్టును దువ్వకండి. ఇలా చేయడం వలన జుట్టు మరింత దెబ్బతింటుంది. పదేపదే దువ్వడం మూలాలను వీకయ్యేలా చేస్తుంది. ఇది చాలా జుట్టు ఊడిపోవడానికి దారితీస్తుంది. తడి జుట్టు దువ్వెన చేయవద్దు… జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం జుట్టుకి హానికరం. ఇది చిట్లిపోవడానికి అలాగే జుట్టు రాలిపోవడానికి మూల కారణం అవుతుంది. కావున వదులుగా ఉన్న జుట్టును కొంత సమయం వరకు సాధారణంగా ఆరనివ్వాలి. ఆ తరువాత వెడల్పాటి దువ్వెన లేదా బ్రష్ తో జుట్టును దువ్వాలి. అప్పటివరకు వేళ్ళను ఉపయోగించి విడదీయవచ్చు.