Hair Tips : జుట్టు నెరిసిపోయిందా.. కరివేపాకుతో ఇలా చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : జుట్టు నెరిసిపోయిందా.. కరివేపాకుతో ఇలా చేయండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 October 2022,3:00 pm

Hair Tips ; కరివేపాకు గురించి అందరికీ తెలిసిందే. ప్రతి భారతీయుడి వంటకాలలో కరివేపాకు అనేది తప్పనిసరిగా ఉంటుంది. వంటలకు రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కరివేపాకులో బి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది హెయిర్ ఫోలికల్స్ లో మెలనిన్ ఉత్పత్ చేయడానికి పనిచేస్తాయి. దీంతో జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్య కూడా దూరమవుతుంది.

జుట్టుకు కరివేపాకు హెయిర్ మాస్క్ తయారు చేసుకోని వేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. కరివేపాకు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. మెలనిన్ లోపం వలన జుట్టు తెల్లగా అయిపోతుంది. ఇలాంటి సమయంలో కరివేపాకుతో చేసిన హెయిర్ మాస్కుని జుట్టుకి పెడితే తెల్ల జుట్టు సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు జుట్టు ఆరోగ్యంగా మృదుగా తయారవుతుంది. దీనికోసం ముందుగా ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో 10, 12 కరివేపాకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 20 నిమిషాలు చల్లారనిచ్చాక పక్కన పెట్టాలి.

Hair tips for white hair with curry leaves

Hair tips for white hair with curry leaves

జుట్టు మీద కరివేపాకు మాస్క్ వేయడానికి రెండు చేతులతో మొత్తం జుట్టు మీద అప్లై చేయాలి. ముందుగా ఈ మాస్క్ తో జుట్టు కుదుర్లను మసాజ్ చేసి తర్వాత జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును కడగాలి. జుట్టు చాలా మృదువుగా మెరిసేలా తయారవుతుంది. కరివేపాకు పెరుగుతో హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్ చుండ్రును తొలగించడానికి బాగా సహాయపడుతుంది. దీనికోసం ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, మూడు నాలుగు కరివేపాకుల పేస్ట్ వేసి బాగా కలిపి ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది