Hair Tips : మీ చేతులు ఎల్లప్పుడూ తల మీదకే వెళ్తున్నాయా… చుండ్రు అధికంగా ఉందా… అయితే ఇలా ట్రై చేసి చూడండి.. అంతా శుభ్రం అవుతుంది…
Hair Tips : ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి చుండ్రు సమస్యతో ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కొందరు తలస్నానం చేసిన ఒకటి రెండు రోజులకే వాళ్ల చేతులు తల మీదికే మాటిమాటికి వెళ్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే. చుండ్రు ఉండడం వలన ఆ విధంగా దురద వస్తూ ఉంటుంది.
అయితే దీనికి కారణం ఏమిటంటే మనం ప్రతిరోజు రెండు మార్లు స్నానం చేసి శరీరాన్ని అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ తలస్నానం చేసేందుకు కేవలం వారానికి ఒక్కసారే చేస్తూ ఉంటారు. వాతావరణంలో ఉన్న పొల్యూషన్, తలలో చెమటలు రావడం, తలలో ఉండే మృతుకణాలు కూడా తలపై ఒక లేయర్ గా అవుతుంది. దానివలన తలలో ఇంప్లమేషన్ ప్రారంభమై ఈ విధంగా దురద వస్తూ ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు.
వీటివలన ఇంకాస్త జుట్టుకి హాని కలుగుతుంది. తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఎన్నో రకాల వంట ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు. వీటి వలన కూడా కొంచెంగా మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కానీ పూర్తి పరిష్కారం ఎప్పటికీ దొరకదు. అలాగే తలలో విడుదలయ్యే.. టాక్సిన్, వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా వలన కూడా వీటితో కలిసి దురదకు కారణం అవుతున్నాయి. కావున ఈ దురదలు నుండి శాశ్వతంగా పరిష్కారం కోసం ఇప్పుడు మనం చూద్దాం… నిత్యము శరీరానికి రెండుసార్లు స్నానం చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసినప్పుడు ఒకసారి తల స్నానం చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. తల స్నానం చేసేటప్పుడు జుట్టు మీద అన్ని వేళ్ళను పెట్టి మర్దనా చేయడంతో , దురదలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఈ విధంగా చేయడం వలన, ఈ చిట్కాను నిత్యము వినియోగిస్తూ ఉంటే.. మీ తల ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. దాని ద్వారా క్రిములు చేరే అవకాశం అస్సలు ఉండదు. కాబట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వాటినుండి ఉపసమనం కలుగుతుందేమో కానీ.. శాశ్వత పరిష్కారం అసలు లభించడం లేదు అనుకునేవాళ్లు ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తూ మంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. అలాగే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది మరియు దాని కోసం ఎటువంటి ప్రొడక్ట్స్ ను వినియోగించుకో నే అవసరం ఉండదు. అలాగే చెడు ప్రభావాలు కూడా ఉండవు. చుండ్రులాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.