Hair Tips : రోజు 100 కన్నా ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నాయా. దీనిని ఒక్కసారి ట్రై చేయండి. జుట్టు నల్లగా ,ఒత్తుగా పెరుగుతుంది!!
Hair Tips : ఇప్పుడు మనమున్న కాలంలో జుట్టు సమస్యలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. వాటికి కారణాలు ఎన్నో రకాలు ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు జీవన విధానంలో అధికమైన ఒత్తిడిలు, వాతావరంలో మార్పులు, కాలుష్యం ఇలా జుట్టు రాలే సమస్య అందరిలో రోజురోజుకి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించిన ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అయితే ఈ సమస్య తగ్గించుకోవడానికి న్యాచురల్ గా ఒక శిరంని తయారుచేసి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ శిరం తయారీ కోసం పది మందార పువ్వులు. ఈ పువ్వులను రెక్క మందారమంటారు. వీటిని తీసుకొని రాత్రి మొత్తం నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఈ నానబెట్టిన పువ్వులని స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి.
తర్వాత ఒక నాలుగైదు లవంగాలను కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. ఇలా ఇవన్నీ వేసి ఒక పది నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించాలి. తర్వాత దీనిని దింపి చల్లారిన తర్వాత వడకట్టుకొని ఈ శిరంని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత 60 నిమిషాల పాటు ఆరనివ్వాలి తర్వాత ఏదైనా తక్కువ గాడతగల షాంపును తీసుకొని దానితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో మూడుసార్లు చేసినట్లయితే జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన జుట్టు మృదువుగా, సిల్కీగా ,పొడవుగా ఒత్తుగా కూడా ఉంటుంది ఈ శిరమును చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాడుకోవచ్చు.
ఈ శిరంలో వాడినటువంటి మందారం ఆకులు, జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టును నల్లగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెంతులు: ఈ మెంతులు జుట్టు రాలడాన్ని ఆపివేయడమే కాకుండా దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లవంగాలు; ఈ లవంగాలు కొత్త జుట్టు మొలవడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అదేవిధంగా ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని తగ్గించి. కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది. దురద, చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ పదార్థాలను వాడి ఈ సీరంను తయారు చేసుకుని ఇంట్లోనే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు..