Hair Tips : ఒక స్ఫూన్ చాలు… మీ జుట్టు అడవి లాగా దట్టంగా పెరుగుతుంది…
Hair Tips : చాలామంది జుట్టు పెరగడానికి వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. కొన్ని చిట్కాలు జుట్టు పెరగడానికి పని చేస్తాయి. కొన్ని పని చేయవు. అయితే మీకు ఈ కొత్త చిట్కాను పరిచయం చేయబోతున్నాం. ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఒక అద్భుత ఫలితాన్నిచూస్తారు. జుట్టు దట్టంగా పెరగడమే కాకుండా డ్యాండ్రఫ్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ చిట్కాను మూడు వారాల పాటు ట్రై చేసారంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టును నల్లగా కూడా చేస్తుంది. ఈ చిట్కాను ఏ వయసు వారు అయిన వినియోగించుకోవచ్చు. ఈ కొత్త చిట్కాను మీకు కనుక అనుసరించినట్లయితే మీ జుట్టు దట్టంగా, పొడవుగా పెరుగుతుంది. అయితే ఈ చిట్కాను ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఒక పెనం తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్ఫూన్ల ఆమ్ల పొడిని తీసుకోవాలి. ఆమ్ల పొడి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. తరువాత ఇందులో బృంగరాజ్ పౌడర్ ను రెండు టేబుల్ స్ఫూన్ల వరకు వేసుకోవాలి. ఈ పౌడర్ ని ఆన్ లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు. తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్ఫూన్ల మెంతుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.కలర్ మారే వరకు దీన్ని కలుపుతు ఉండాలి. ఇలా నలుపు రంగు వచ్చేవరకు కలుపుకోవాలి. తరువాత ప్రక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇందులో ఉపయోగించిన ఆమ్ల పొడి జుట్టు ఒత్తుగా పెరగడానికి, చుండ్రును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఇది జుట్టును దట్టంగా, పొడవుగా పెరగడానికి దోహదం చేస్తుంది తరువాత మరొక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లను పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రెండు స్ఫూన్ల టీ పొడిని వేసుకొని డికాషన్ లాగా తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డికాషన్ ను మనం ముందుగా తయారు చేసుకొని ప్రక్కన పెట్టుకున్న మిశ్రమంలో ఈ డికాషన్ ను వేసుకొని మళ్లీ స్టవ్ పై పెట్టి దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారు అయిన మిశ్రమంను రెండు స్ఫూన్లు తీసుకొని మనం వాడే షాంపులో వేసుకొని బాగా కలిపి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు అడవిలాగా దట్టంగా, పొడవుగా, నల్లగా పెరుగుతుంది.