Hair Tips : ఈ రెండు టిప్స్ ఉపయోగిస్తే .. ఎంతటి పలుచటి జుట్టు అయిన ఇట్టే లావుగా అయిపోవడం ఖాయం…!
Hair Tips : నేటి కాలంలో చాలామంది జుట్టు సమస్య తో బాధపడుతున్నారు. దీనికి గల కారణం నేటి కాలంలో అవుతున్న పొల్యూషన్ అని చెప్పాలి. ఈ పొల్యూషన్ కారణంగా చాలామంది చాలా రకాల సమస్యలకు గురవుతున్నారు. ఇక దీనిలో జుట్టు రాలడం ప్రధాన అంశంగా పేర్కొనబడుతుంది. ఇక ఈ సమస్యతో బాధపడే వారికి ఈ రెండు చిట్కాలు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే .. మొదటి చిట్కా… దీనికోసం ముందుగా ఆపిల్ స్పైడర్ వెనిగర్ ను తీసుకోవాలి. ఈ ఆపిల్ ఆపిల్ స్లైడర్ వెనిగర్ ఉపయోగించడం వలన తలపై మూసుకుపోయిన సూక్ష్మ రంధ్రాలు తెరవబడి జుట్టు ఎదుగుదలకు దోహదపడతాయి.
ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలో 200 ml నీటిని పోసుకోవాలి. ఇక దానిలో మూడు స్పూన్ ల ఆపిల్ స్లైడర్ వెనిగర్ ను వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో శుభ్రం చేసిన రెండు కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒకరోజు రాత్రంతా నానపెట్టుకోవాలి. తర్వాత రోజున ఆ నీటిని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రెండవ చిట్కా.. దీనికోసం ముందుగా మన ఇంట్లో ఉపయోగించే రెండు స్పూన్ ల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే ప్రతిఫలం ఎక్కువ ఉంటుందని చెప్పాలి.
ఈ బియ్యం ను ఒక గాజు సిసలో తీసుకుని అందులో 200 ml నీటిని పోసుకుని దానిలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. బియ్యంలోని ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మెంతులు మన జుట్టు స్మూత్ అండ్ సిల్క్ గా చేయడంలో దోహదపడుతుంది. ఈ మిశ్రమాన్ని కూడా ఒకరోజు మొత్తం నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ నీటిని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇది జుట్టుకు ఒక మంచి హెయిర్ టానిక్ గా పనిచేసి జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించినట్లయితే 30 రోజుల్లోనే మంచి రిజల్ట్ ను పొందుతారు.