Green Apple : మధుమేహం ఉన్నవారికి ఏది బెస్ట్ ఫ్రూట్… రెడ్ ఆపిల్ OR గ్రీన్ ఆపిల్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Green Apple : మధుమేహం ఉన్నవారికి ఏది బెస్ట్ ఫ్రూట్… రెడ్ ఆపిల్ OR గ్రీన్ ఆపిల్…!

Green Apple : యాపిల్స్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే. ప్రతిరోజు ఒక యాపిల్ ను కనుక తీసుకున్నట్లయితే డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు అని అంటుంటారు. యాపిల్ అనేది గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో రక్షిస్తుంది. ఈ ఆపిల్ క్యాన్సర్ ను కూడా నియంత్రిస్తుంది. ఆపిల్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు ఒక యాపిల్ తీసుకోవటం మీ ఆరోగ్యానికి ఒక పెట్టుబడి లాంటిది. రెడ్ ఆపిల్ లాగే గ్రీన్ యాపిల్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Green Apple : మధుమేహం ఉన్నవారికి ఏది బెస్ట్ ఫ్రూట్... రెడ్ ఆపిల్ OR గ్రీన్ ఆపిల్...!

Green Apple : యాపిల్స్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే. ప్రతిరోజు ఒక యాపిల్ ను కనుక తీసుకున్నట్లయితే డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు అని అంటుంటారు. యాపిల్ అనేది గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో రక్షిస్తుంది. ఈ ఆపిల్ క్యాన్సర్ ను కూడా నియంత్రిస్తుంది. ఆపిల్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు ఒక యాపిల్ తీసుకోవటం మీ ఆరోగ్యానికి ఒక పెట్టుబడి లాంటిది. రెడ్ ఆపిల్ లాగే గ్రీన్ యాపిల్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గ్రీన్ ఆపిల్ లో విటమిన్ ఎ, బి, సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక దీనిలో పొటాషియం, ఐరన్, ప్రోటీన్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయి. మధుమేహంతో బాధపడుతున్న వారు రెడ్ ఆపిల్ కి బదులుగా గ్రీన్ ఆపిల్ తీసుకుంటే చాలా మంచిది. గ్రీన్ ఆపిల్ కంటే రెడ్ యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. అయితే గ్రీన్ ఆపిల్స్ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ ఆపిల్ రోగనిరోధక శక్తి ని పెంచడంలో సహాయపడే యాంటీ యాక్సిడెంట్లు గొప్ప మూలం అని చెప్పొచ్చు. ఇది సంక్రమణతో పోరాడటానికి ఎంతో సహాయం చేస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజు ఆపిల్స్ తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి ప్లేవునా యిడ్స్, ఫాలీనాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పని చేయటం లో కూడా ఎంతగానో మేలుచేస్తుంది. గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జర్ణక్రియ కు కూడా ఎంతగానే మేలు చేస్తుంది. అంతేకాక మలబద్ధకం నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ గ్రీన్ ఆపిల్ లో ఫక్టివ్ అనేది ఉంటుంది. ఇది ఫైబర్ కు మంచి మూలం అని కూడా చెప్పొచ్చు. ఇది ప్రోబయోటిక్ గా కూడా పని చేయగలదు. ఇది గట్ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థను సరి చేసేందుకు గ్రీన్ ఆపిల్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు..

గ్రీన్ యాపిల్ అనేది చాలా తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇవి టైప్ టు డయాబెటిస్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. తక్కువ గ్లైసిమిక్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు స్లోగా జీర్ణం అవుతాయి. చాలా నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి కూడా వెళ్ళిపోతాయి. దీంతో రక్తంలోనే చక్కర స్థాయి అనేది పెరగదు. అంతేకాక మధుమేహ సమస్య నుండి కూడా దూరంగా ఉంచుతుంది. అందువల డయాబెటిస్ ఉన్నవారికి గ్రీన్ ఆపిల్ మంచిది. గ్రీన్ యాపిల్ అనేది కడుపులోని మంటను కూడా నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, చెడు కొలెస్ట్రా ల్ స్థాయిలను కూడా నియత్రిస్తుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాల నుండి కూడా రక్షిస్తుంది. గ్రీన్ ఆపిల్ లో ఉండే ఫైటో కెమికల్ క్యాన్సర్ నివారించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను దెబ్బతినకుండా కూడా రక్షిస్తుంది.

Green Apple మధుమేహం ఉన్నవారికి ఏది బెస్ట్ ఫ్రూట్ రెడ్ ఆపిల్ OR గ్రీన్ ఆపిల్

Green Apple : మధుమేహం ఉన్నవారికి ఏది బెస్ట్ ఫ్రూట్… రెడ్ ఆపిల్ OR గ్రీన్ ఆపిల్…!

ఇది డిమోన్షియ వ్యాధుల ప్రమాదాల నుండి కూడా రక్షించగలదు. ఈ గ్రీన్ ఆపిల్ అనేది మెదడు ఆరోగ్యానికి ఎంతగానో పనిచేస్తుంది. గ్రీన్ ఆపిల్ లో ఉన్నటువంటి ఫైబర్ అనేది బరువు తగ్గటానికి కూడా సహాయం చేస్తుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ ఆపిల్ తీసుకోవడం వలన కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఎక్కువ సమయం పాటు ఆకలి అనేది ఉండదు. మీరు గనక తొందరగా బరువు తగ్గాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు గ్రీన్ ఆపిల్ తీసుకోవడం మంచిది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది