Health Benefits : ఈ గింజలను నానబెట్టి తిన్నారంటే.. ఐరన్ మ్యాన్ లా గట్టిగా అవ్వడం ఖాయం!
Health Benefits : నువ్వుల గురించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే నువ్వులు తెలియని వారుండరు. దాదాపు ప్రతి రోజూ వంటకాల్లో మనం వాడుతుంటాం. నువ్వులు రుచి గురించి అందరికీ తెలిసినప్పటికీ అవి చేసే మేలు గురించి మాత్రం చాలా మందికి తెలియదు. నువ్వుల్లో ముఖ్యంగా ఎముకల నిర్మాణానికి కావాల్సిన కాల్షియం అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల వ్వుల్లో 1450 గ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలకి 450 మిలీ గ్రాములు, పిల్లలకి 600 మిల్లీ గ్రాములు, గర్భిణీ మహిళలకు 900 గ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. అందుకోసమే ప్రతిరోజూ నువ్వుల ఉండలు తనిమని చెబుతుంటారు చాలా మంది.మన పూర్వీకుల నుంచి బెల్లంతో నువ్వులు ఉండలు తయారు చేసుకొని తినడం ఆనవాయితీగా వస్తోంది.
కమ్మటి రుచితో పాటు ఎముకలను గట్టి చేసే ఈ నువ్వుల ఉండలు అంటే చాలా మందికి ఇష్టం. అయితే కొందరు మాత్రం నువ్వుల ఉండలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ వేడి చేస్తుందనే అనుమానంతో వాటిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ నిజానికి నువ్వుల్లో వేడి చేసే గుణం అస్సలే లేదు. సరిగ్గా నీరు తాగకపోవడం, ఆవకాయ తినడం వల్ల వేడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల కూడా వేడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిదని అంటారు. నువ్వుల పొడి వంటల్లో చల్లుకున్న వేడి చేయదు. నువ్వులను ఖర్జూరం లేదా బెల్లంతో లడ్డూలు చేసి వాడుకున్న చాలా మంచిది. మన శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది.

health benefits bone strength for Sesame seeds
నువ్వులు ఈ రూపంలో మీకు ఇబ్బంది లేకుండా తినిపించే పద్ధతులు. నువ్వుల్లో సమృద్ధిగా ఉండే కాల్షియం శరీరానికి మంచిగా ఒంటబట్టాలంటే నువ్వుల్ని నాన బెట్టి కొంచెం తీసుకుని… మొలకలు తినే సమయంలో వాటికి కలిపి నువ్వులను కూడా తీసుకుంటే వాటిని సరిగ్గా నమలడం కుదరదు. నువ్వులను అలాగే జీర్ణాశయంలోకి జారి పోతాయి. అటు నుండి మలం ద్వారా బయటకు వస్తాయి.దవడకు ఉండే పళ్లతో నువ్వులను మంచిగా నమలడం ద్వారా వాటిలోని పోషకాలు సరిగ్గా అందుతాయి. అందులో ఉండే కాల్షియం శరీరానికి అలాగే అందుతుంది. అలాగే నువ్వులు తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని చాలా మంది తప్పుడు సమాచారం అందిస్తారు. ఇది పెద్ద అపోహ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. గర్భిణీలకు నువ్వులు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతారు.