Health Benefits : ఈ చెట్టు కనిపిస్తే… మర్చిపోకుండా ఇలా చేయండి.. సరేనా!
Health Benefits : పల్లెల్లో పుట్టి పెరిగిన ప్రతీ ఒక్కరికి సిరా కాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నీలంగా, చిన్న చిన్నగా ఉండే ఈ కాయలు చిన్న తనంలో నలిపితే వీటి వల్ల వచ్చే రంగును ఒకరికొకరు రాసుకునే వారు. అంతే కాకుండా వీటిని తినడం వల్ల నాలుక నీలంగా మారితే అది చూసి పిల్లలు సంతోష పడేవారు. అలాంటి ఈ చెట్టు ఆకులు, కాయలు అనేక ఆయుర్వేద చికిత్సా గుణాలను కల్గి ఉంటాయని చాలా మందికి తెలియదు. వీటిని ఉపయోగించి అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ మొక్క ఫిలంథస్ రెక్టికులస్ జాతికి చెందిది. దీన్ని ఫిలాంథస్ రెక్టికులస్ అంటారు. దీన్ని తెలుగులో సిరా కాయలు, పురుగుడు చెట్టు, నల్ల పురుగుడు చెట్టు, ఇంకు కాయలు చెట్టు వంటి అనేక పేర్లతో పిలుస్తారు.
ఇంగ్లీషులో ఈ చెట్టు పువ్వులు బంగాళ దుంప వాసన రావడం వల్ల పొటాటో బుష్ అని పిలుస్తారు. అలాగే ఈ చెట్టుకు వచ్చే పండ్లు పుల్లటి ద్రాక్షను పోలిన రుచి ఉండటం వల్ల సోర్ క్రీపర్ అని పిలుస్తారు.అయితే నోటి దుర్వాసన తొలగించుకోవడానికి పళ్ల చిగుళ్ల వాపు, నొప్పి తగ్గించుకోవడానికి ఈ చెట్టు ఆకులు నీటిలో మరిగించి ఈ నీటిని పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసనను తొలగించుకోవచ్చు. అలాగే ఈ చెట్టు యొక్క కాండంతో దంతధావనం చేయడం ద్వారా పళ్లను ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. ఈ కాండంతో పళ్లను తోమడం మన పూర్వీకుల నుండి చేసేవారు. ఈ చెట్టు ఆకులను నీడలో ఎండబెట్టి పొడిలా చేసి కొంచెం ఉప్పు కలిపి పళ్ల పొడిలా ఉపయోగిస్తూ… దంతధావనం చేయడం వల్ల పంటి నొప్పి, పంటి నుండి రక్తం రావడం వంటి సమస్యలు తగ్గి పళ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
నోటి పూత సమస్య ఉన్న వారు ఈ చెట్టు ఆకులను నమిలితే నోటిపూతను తగ్గించుకోవచ్చు. అలా చేయలేని వారు ఆకులను, బెరడను తీసుకొని నీటిలో మరిగించి రోజుకు నాలుగైదు సార్లు ఈ కషాయంతో నోటిని పుక్కిలించడం ద్వారా నోటి పూత సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నాలుకపై పగుళ్లు, పెదవుల పగుళ్లకు ఈ ఆకులు చాలా బాగా పని చేస్తాయి. ఆకులను నిలి రసాన్ని నోటిలో ఉంచుకొని కొంత సేపటి తర్వాత ఊయడం వలన నాలుక పగుళ్లు తగ్గించుకోవచ్చు. అలాగే పెదవులు పగిలినప్పుడు ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల పెదవులు పగుళ్లు, పెదవులు చివర్లో వచ్చే పుండ్లను తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు విరేచనాలు మరియు ఫైల్స్ ను ఉబ్బసం నివారణ కోసం ఉపయోగిస్తారు.