Health Benefits : రోజు రెండు ఉల్లిపాయలను తిన్నారంటే… ఎన్నో ప్రయోజనాలు… మీకోసం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : రోజు రెండు ఉల్లిపాయలను తిన్నారంటే… ఎన్నో ప్రయోజనాలు… మీకోసం..

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2022,5:00 pm

Health Benefits : ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా పాలిష్ చేసినవి ఉపయోగిస్తున్నారు. తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, పిండి, మైదా ,బొంబాయి రవ్వ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోకి పీచు పదార్థం సరిగా వెళ్లకపోవడం వల్ల ఫ్రీ మోషన్ కాక మలం పేగుల్లో ఉండి ఇన్ఫెక్షన్లకు గురి అయ్యి మంచి బ్యాక్టీరియా తొలిగిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఏర్పడి మల పేగులకు సంబంధించిన క్యాన్సర్ తీవ్రంగా పెరిగిపోతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు కూడా వస్తుంది. మోషన్ రెండు రోజులకి ఒకసారి వెళ్లిన పర్వాలేదు అని అనిపిస్తుంది.

మల పేగులకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా అరికట్టుకోవడానికి ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తే. ఉల్లి బాగా ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ ఉల్లి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. దీనిలో ఉండే కెమికల్ కాంపౌండ్ విటమిన్ ఏ పైసిటీన్ ,కోసితిన్ ఈ మూడు రకాల కెమికల్ కాంపౌండ్లు ఉల్లిపాయలు ఉండడం వల్ల పేగుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గడానికి ఉల్లిపాయ చక్కగా పనిచేస్తుంది. అయితే పేగుల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడినప్పుడు అందులో ఉండే డి ఎన్ ఏ కణజనాలు డామేజ్ అయ్యి క్యాన్సర్ కణాలుగా ఏర్పడతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక ఉల్లిపాయని రోజుకి 100 గ్రాముల చొప్పున వాడితే సరిపోతుంది. దీనిపై ఇటలీ వారు పరిశోధనలు చేయగా వీరు ఒక పెద్ద ఉల్లిపాయను వీరి మీద ఉపయోగించడం వల్ల మూడు నెలల లోపే మల పేగులు వచ్చే క్యాన్సర్ 50 శాతం వచ్చే అవకాశం తగ్గుముఖం పట్టిందని తెలియజేశారు.

Health Benefits If you eat two onions a day

Health Benefits If you eat two onions a day

ఇటలి వారు ఈనాటి నుంచి ఈ ఉల్లిపాయలను ఉపయోగించడం అలవాటు చేశారు. అలాంటి ఉల్లిపాయను ఇప్పుడు మనం వండుకొని తినే పద్ధతి మనకు ఇప్పుడు అలవాటయింది. బాగా మరిగిన నూనెలో ఉల్లిపాయలు వేయడం ద్వారా దానిలో ఉండే లాభాలు అన్ని కోల్పోతాయి. కాబట్టి గోరువెచ్చగా ఉన్న నూనెలో ఉల్లిపాయలను వేయించుకోవడం ద్వారా తగిన ఫలితం ఉంటుంది. లేకుంటే పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలను తింటే దానివల్ల ప్రయోజనాలు మనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉల్లిపాయ ఫ్రీ మోషన్ అవ్వని వారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది