Health Benefits : బొబ్బర్లతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ఇలా తీసుకుంటే మాత్రం ప్రమాదమే..
Health Benefits : బొబ్బర్లు లేదా అలసందలు అని పిలుచుకునే పప్పుధాన్యం. ఈ బొబ్బర్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని ఎక్కువగా మొలకెత్తిన గింజల రూపంలో గానీ.. ఉడకబెట్టిగానీ తీసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు, ప్రోటిన్స్ ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారికి.. బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తాయి. అలసందల్లో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. వీటిని తినడం వల్ల మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి చెందుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవనీయ్యదు.
అంతే కాకుండా మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.అలాగే బొబ్బర్లలో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో, వ్యాప్తి చెందకుండా ఉపయోగపడతాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరమైన టాక్సిన్స్‌ను నివారిస్తుంది.
ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మల బద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.అలసందలు మొలకెత్తిన తర్వాత తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది మొలకెత్తిన గింజలను తినడానికి ఇష్టపడతారు. అలాగే వీటిని బాగా ఉడికించి ఇందులో నిమ్మరసం, స్పైసీగా ఉండటానికి కొంచె చిల్లి పౌడర్ ను కలుపుకొని తీసుకుంటారు. గ్రామాల్లో ఎక్కువగా ఈ విధంగా తీసుకుంటారు. అలాగే బొబ్బర్లను నీళ్లలో ఎక్కువసేపు నానబెట్టి తీసుకుంటే కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.