Health Benefits : పది నిమిషాల్లో నొప్పులన్ని మాయం.. ఇలా చేస్తే ఒకే ఆకుతో నొప్పులన్నింటికి చెక్
: ప్రస్తుత జనరేషన్ లో చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, కాళ్లు, చేతులు లాగడం వంటి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఈ నొప్పుల వల్ల రానురాను ఇంట్లో సాధారణ పనులు చేసుకోవడానికి మరోకరిపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నొప్పులు సాధారణంగా ఎక్కువ సేపు నిల్చోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం, కాల్షియం లోపం అలాగే థైరాయిడ్, అధిక బరువు, బలహీనత వల్ల వస్తుంటాయి. ఈ నొప్పులకు స్టార్టింగ్ స్టేజ్ లోనే మంచి ట్రీట్ మెంట్ తీసుకోవాలి.అయితే నడుము నొప్పి వచ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ కొరకు మందులు వాడడం ప్రస్తుతం ఎక్కువైంది. ఈ క్రమంలో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను గురించి పట్టించుకోవడం లేదు. అయితే అలాంటి మెడిసిన్ వాడాల్సిన పని లేకుండానే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు.
నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.ఒక కప్పు పాలలో తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు. నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు. అలాగే రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకూ మరిగించాలి. వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది. నొప్పి ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది. రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగినా నొప్పి తగ్గుతుంది.
helth tips:తయారి విధానం.. కావల్సిన పదార్ధాలు
అలాగే కీళ్ల నొప్పులకు కుడా చక్కటి పరిష్కారం ఉంది. ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి. ఈ పొడిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత నల్ల మిరియాలు మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి. మెత్తని పిండిలా వచ్చేందుకు జల్లెడ పట్టాలి. కాస్తా జీలకర్ర కూడా మిక్స్ చేసుకోవాలి. దీనిని కూడా జల్లెడ పట్టి అన్ని పదార్ధాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లోకి తీసుకుని నిల్వచేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా మిశ్రమం వేసి కలపాలి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు. దీంతో కీళ్ల నొప్పులకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
అలాగే జిల్లెడు ఆకులు రెండు, కలబంద కొమ్మ ఒకటి, ఆముదం, నువ్వుల నూనే, ఆవ నూనే. వేపనూనే, ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. అలోవేరా గుజ్జును మెత్తగా చేసుకోవాలి. ఈ గుజ్జులో అర చెంచా పసుపు వేసి కలపాలి. అలాగే పైన తెలపిన నూనెలన్ని ఒక బౌల్ లోకి తీసుకుని కలబంద గుజ్జుతో మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత జిల్లెడు ఆకులకు మిగతా నూనే రెండు వైపుల రుద్దాలి. స్టౌ పై ఇనుప పెనం పెట్టి ఆకులను వేడి చేసుకోవాలి. కాగా కలబంద మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ రాయాలి. ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత వేడి చేసిన జిల్లెడు ఆకులను నొప్పి ఉన్న చోట ఏదైనా గుడ్డతో కట్టాలి. ఇలా చేయడం ద్వారా కూడా నొప్పులు చాలా తొందరగా తగ్గుతాయి.