Health Benefits : వీటితో త‌యారు చేసిన ప‌న్నీర్ తింటే మాంసం కూడా వ‌ద్దంటారు.. వెంట‌నే తినేయండి మ‌రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వీటితో త‌యారు చేసిన ప‌న్నీర్ తింటే మాంసం కూడా వ‌ద్దంటారు.. వెంట‌నే తినేయండి మ‌రి

Health Benefits : సోయాబీన్స్ ను మాంసం, పాల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ర‌కాల ఆహార ప‌ద‌ర్థాల‌ను త‌య‌రుచేసుకోవ‌చ్చు. మొక్కల నుండి లభించే ప్రోటీన్స్ లో అన్నిటికంటే ఎక్కువ సోయా బీన్స్ లోనే పుష్క‌లంగా ఉంటాయి. మాంస ప‌దార్థాల‌తో సమానంగా దీని లో ప్రోటీన్స్ ఉంటాయి. పాలలో లభించే ప్రోటీన్లతో సమానంగా సోయాలో ఉంటాయి. ప‌లు వంట‌కాల్లో సోయా పిండి, సోయా పాలు, కాటేజ్ చీజ్ వంటి వాటిన వాడ‌తారు. వంటల్లో సోయాబీన్ నూనె ను కూడా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 April 2022,7:00 am

Health Benefits : సోయాబీన్స్ ను మాంసం, పాల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ర‌కాల ఆహార ప‌ద‌ర్థాల‌ను త‌య‌రుచేసుకోవ‌చ్చు. మొక్కల నుండి లభించే ప్రోటీన్స్ లో అన్నిటికంటే ఎక్కువ సోయా బీన్స్ లోనే పుష్క‌లంగా ఉంటాయి. మాంస ప‌దార్థాల‌తో సమానంగా దీని లో ప్రోటీన్స్ ఉంటాయి. పాలలో లభించే ప్రోటీన్లతో సమానంగా సోయాలో ఉంటాయి. ప‌లు వంట‌కాల్లో సోయా పిండి, సోయా పాలు, కాటేజ్ చీజ్ వంటి వాటిన వాడ‌తారు. వంటల్లో సోయాబీన్ నూనె ను కూడా ఉప‌యోగిస్తారు. కొన్ని సోయా పదార్థాలలో కొవ్వును తొలగించి సోయా పిండిని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలానే కొవ్వు తీసేసిన టోఫు, కొవ్వు లేని పాలు కూడా అందుబాటులో ఉంటాయి.

సోయాలో ఫైబ‌ర్ కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం పాలలో ఉండే కాల్షియం తో సమానంగా ఉంటుంది. ఇతర న్యూట్రియన్స్ సోయా ఫుడ్స్ లో విటమిన్ బీ కూడా పుష్క‌లంగా ఉంటాయి.సోయాలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.తక్కువ ఫ్యాట్, తక్కువ కొలెస్ట్రాల్ ఉండ‌టంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం మరియు మినరల్స్ సమృద్ధిగా ల‌భిస్తాయి.సోయా మిల్క్‌ను పోషకాల గని అని చెప్పవచ్చు. ఈ పాలలో మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ పుష్క‌లంగా ల‌భిస్తాయి. రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని సోయా మిల్క్ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Health Benefits in protein rich foods reduce ovarian cysts SOYA BEANS

Health Benefits in protein rich foods reduce ovarian cysts SOYA BEANS

Health Benefits : సోయా గింజ‌ల పాల‌తో ప‌న్నీర్

అలాగే మెనోపాజ్‌ వయసు మహిళల్లో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గి సులభంగా హృద్రోగాల బారిన పడుతుంటారు. వీరు సోయాప‌లు తీసుకుంటే మంచిది. సోయా గింజ‌ల‌ను నాన‌బెట్టి మిక్స్ ప‌ట్టాలి. ఆ పాల‌ను మ‌రిగించుకోవాలి. ఇందులో నిమ్మ‌ర‌సం పిండి పాలు విరిగిపోగా ఫిల్ట‌ర్ చేసుకుని గుజ్జుని ప‌న్నీర్ ముక్క‌లుగా త‌యారు చేసుకుని వంట‌కాల్లో వాడుకోవ‌చ్చు. ఇది ఎక్కువ ప్రొటీన్స్ క‌లిగి ఉంటుంది. ఇది గుండెకు మంచి కొలెస్ట్రాల్ పెడ‌గ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల స్త్రీల‌లో పీరియ‌డ్స్, పీసీవోడి స‌మ‌స్య త‌గ్గి మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది. శ‌రీరంలో కొవ్వుపేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్స్ ర్ ను రాకుండా అడ్డుకుంటుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది