Health Benefits : తమలపాకుతో ఇంత ప్రమాదమా..? తెలిస్తే అస్సలు ముట్టరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : తమలపాకుతో ఇంత ప్రమాదమా..? తెలిస్తే అస్సలు ముట్టరు…!!

Health Benefits : సహజంగా తమలపాకుతో ఎన్నో రకాల కిల్లిలను తయారు చేస్తూ ఉంటారు. ఈ కిల్లిలు భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ తమలపాకు కిల్లి తినడం వల్ల తిన్న భోజనం సరిగ్గా జీర్ణం అవుతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ తమలపాకు వలన ఆరోగ్యానికి కొన్ని విధాలుగా మంచిది. కానీ పరిమితికి మించి తమలపాకు తీసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే… ఎన్నో విధాల పోషకాలు ఉన్న తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 February 2023,10:00 am

Health Benefits : సహజంగా తమలపాకుతో ఎన్నో రకాల కిల్లిలను తయారు చేస్తూ ఉంటారు. ఈ కిల్లిలు భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ తమలపాకు కిల్లి తినడం వల్ల తిన్న భోజనం సరిగ్గా జీర్ణం అవుతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ తమలపాకు వలన ఆరోగ్యానికి కొన్ని విధాలుగా మంచిది. కానీ పరిమితికి మించి తమలపాకు తీసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే… ఎన్నో విధాల పోషకాలు ఉన్న తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ ఆకులను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల ఆసమతుల్యత ఏర్పడి తీవ్ర వ్యాధులకు కారణమవుతూ ఉంటుంది..

Health Benefits of Betel leaves

Health Benefits of Betel leaves

అయితే ఈ తమలపాకు వలన కలిగే నష్టాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం… *ఓరల్ క్యాన్సర్ : తమలపాకులు అధికంగా తినడం వలన నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.. మార్కెట్లో దొరికే పాన్లో కూడా పొగాకు కలుస్తుంది. ఇది హానికరమైంది కావడంతో నోటి క్యాన్సర్ సమస్య వస్తుంది. *హార్మోన్ల ఆసమతుల్యత: పాన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమల్యుత వస్తుంది. తమలపాకు అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు కూడా వస్తాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ ని పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది.. *ప్రెగ్నెన్సీ ఇబ్బందులు : తమలపాకులను అధికంగా తినడం వలన గర్భధారణ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇది గర్భంలో పిండం దాని అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది.

Health Benefits of Betel leaves

Health Benefits of Betel leaves

అలాగే పిల్లల అభివృద్ధికి కూడా ఇబ్బందులు కలుగుతాయి.. *అలర్జీ : తమలపాకును అధికంగా తినడం వలన చర్మ అలర్జీలు వస్తాయి. ఫలితంగా చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చి ఎర్రగా మారుతూ ఉంటాయి. * హై బీపీ: తమలపాకులు అధికంగా తింటే హైబీపీ సమస్య వస్తుంది. ఇది అధిక రక్తపోటు అసాధారణ హృదయ స్పందనలకు దారితీస్తూ ఉంటుంది. దీనిని కారణంగా శరీర ఉష్ణోగ్రత అధికమయ్యేలా చేస్తుంది… *చిగుళ్లలో నొప్పి : తమలపాకును ఎక్కువ తీసుకోవడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. అలాగే త్రివరమైన నొప్పితో పాటు చిగుళ్ళు దవడలలో వాపు వచ్చి నొప్పి అధికమయ్యేలా చేస్తుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది