Betel Leaves : తమలపాకు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… వెంటనే తినడం మొదలు పెడతారు…!!
ప్రధానాంశాలు:
Betel Leaves : తమలపాకు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... వెంటనే తినడం మొదలు పెడతారు...!!
Betel Leaves : భారత దేశ సంస్కృతిలో తమలపాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ తమలపాకులను విందు భోజనం తర్వాత తాంబూలం లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. అయితే ఈ తమలపాకులను మౌత్ ఫ్రెషనర్ గా వాడటమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తమలపాకులో కార్డియో వాస్కులర్ మరియు యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనో మైడ్యులేటరీ,యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ అల్సర్, హెపాటో-ప్రొటేక్టీవ్ లాంటి ఎన్నో రకాల లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ఎముకలు దృఢత్వానికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ మరియు కాల్షియం, విటమిన్ ఏ సీ లు కూడా దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాక జీర్ణ వ్యవస్థకు కూడా ఎంతో తోడ్పడుతుంది…
తమలపాకులలో తగిన మొత్తంలో అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. దీంతో మలబద్ధక సమస్య నయం అవుతుంది. అలాగే ఈ తమలపాకును యాంటీ యాక్సిడెంట్ పవర్ హౌస్ గా కూడా చెబుతుంటారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అయితే మీరు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఇది జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలో కార్మినేటివ్ మరియు యాంటీ ఫ్లాట్యూలేన్స్ లాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది జీర్ణాశయంతరా సమస్యలను దూరం చేయటంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి ఎంతో ముఖ్యమైన ఖనిజాలు మరియు పోషకాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది…
ఈ తమలపాకులు శ్వాసకు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తాయి. అలాగే ఊపిరితిత్తులు మరియు ఛాతిలో ఇబ్బంది లాంటి లక్షణాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ తమలపాకులకు ఆవాల నూనె రాసి ఛాతిపై ఉంచితే ఛాతిలో ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. అలాగే తమలపాకుల చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది…