Dry Raisins : ఎండు ద్రాక్ష నమ్మలేని నిజాలు.. తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dry Raisins : ఎండు ద్రాక్ష నమ్మలేని నిజాలు.. తెలిస్తే షాక్ అవుతారు…!

Dry Raisins : మన శరీరంలో రక్తం తగ్గినప్పుడు కొందరు ద్రాక్ష రసాన్ని తాగమని చెబుతూ ఉంటారు. అయితే అన్నిసార్లు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం లేదా అన్ని వేళల్లో తీసుకోవడం కొంతమందికి కుదరకపోవచ్చు.. మరికొందరికి ద్రాక్ష రసం కూడా పడదు.. అలాంటి వాళ్ళు ఎండు ద్రాక్ష తినడానికి మొగ్గు చూపుతారు. నిజానికి ఎండు ద్రాక్షల్లో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలి. రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజు […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Dry Raisins : ఎండు ద్రాక్ష నమ్మలేని నిజాలు.. తెలిస్తే షాక్ అవుతారు...!

Dry Raisins : మన శరీరంలో రక్తం తగ్గినప్పుడు కొందరు ద్రాక్ష రసాన్ని తాగమని చెబుతూ ఉంటారు. అయితే అన్నిసార్లు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం లేదా అన్ని వేళల్లో తీసుకోవడం కొంతమందికి కుదరకపోవచ్చు.. మరికొందరికి ద్రాక్ష రసం కూడా పడదు.. అలాంటి వాళ్ళు ఎండు ద్రాక్ష తినడానికి మొగ్గు చూపుతారు. నిజానికి ఎండు ద్రాక్షల్లో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలి. రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజు ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అని పూర్తి వివరాలు చూద్దాం.. ఎండు ద్రాక్షాలు ఒక బెస్ట్ ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. ఇంకా ఈ ఎండు ద్రాక్షాలను పరిమితంగా తింటే ఫ్యాట్ కొలెస్ట్రాల వంటి సమస్యలు కూడా దరిచెరవు. ఎండు ద్రాక్షాలు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు ద్రాక్షాలు ఐరన్ పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు ఎండు ద్రాక్షాలు నేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో కూడా వివిధ రకాలు ఉంటాయి. వాటిలో గోల్డెన్ కలర్ వి గ్రీన్ కలర్ వి అలాగే బ్లాక్ కలర్ వి ఇలా దొరుకుతూ ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా పోషకాలు ఒకేలా ఉంటాయి. ఈ ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు నాచురల్ షుగర్లతో ఎండు ద్రాక్షాలో నిండు ఉంటాయి.

కాబట్టి ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షాలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది. అంటే ఇన్స్టెంట్గా శక్తి వస్తుంది. ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి ఎండు ద్రాక్షాలు మంచి ఆప్షన్ ఇవి ప్రతిరోజు తింటే బరువు తగ్గుతారు. కాబట్టి మీరు బరువు తగ్గడానికి ఏమైనా డైటింగ్ చేస్తుంటే మీ డైకిషన్ లేదా మీ డాక్టర్ సలహా మేరకు ఎండు ద్రాక్ష కూడా మీ డైట్ లో చేర్చండి. ఎండు ద్రాక్షాలు వంటల్లో వాడుతూ ఉంటారు. కొంతమంది నేరుగా తింటూ ఉంటారు. వీటికంటే కూడా నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుకోవచ్చు. నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షాలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. దీనికి ఏం చేయాలి అంటే ఒక ఎనిమిది నుండి 10 ఎండుద్రాక్షలను శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాసు గాని ఒక చిన్న గిన్నెలో గాని వేసి నీళ్లు పోసి నాన్ననివ్వండి. వీటిని ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పాలలో కలుపుకుని తాగొచ్చు. లేదా నమిలి తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలా నమిలి తిన్న తర్వాత ఈ నీటిని పడబోయకండి. పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుకుంటారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఎండుద్రాక్షలో క్యాల్షియం మరియు మైక్రో న్యూట్రిషన్లు అధికంగా ఉంటాయి.

ఇవి బోన్ హెల్త్ ని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎండు ద్రాక్ష రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే వీక్నెస్ అనే మాట ఉండదు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.తగ్గించే పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇక్కడ ఎండు ద్రాక్ష తినడం వల్ల మంచి ఫలితాలు మాత్రమే కాకుండా దుష్ఫలితాలు కూడా ఉంటాయి. అయితే అవి ఎలా వస్తాయి ఎటువంటివారు తినకూడదు అనే వివరాలను కూడా చూద్దాం. కొందరు తమకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలుచబరచే మందులను వాడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎండు ద్రాక్ష తినకపోవడం మంచిది.. ఎందుకంటే ఆ మందులతో ఈ ఎండు ద్రాక్ష ప్రతికూల ప్రతి చర్యలు జరిపే అవకాశం ఉంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు.. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు గానీ పిల్లలకు పాలుస్తున్నప్పుడు కూడా ఈ ఎండు ద్రాక్షాలు దూరం పెడితే మంచిది

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది