Health Benefits : ఈ నీలగిరి ఆకుతో ఇన్ని ప్రయోజనాల… మీరు తప్పక తెలుసుకోవాలి…
Health Benefits : ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలాంటి మొక్కలలో నీలగిరి మొక్క కూడా ఒకటి. ఈ నీలగిరి ఆకులతో తైలాన్ని తయారు చేస్తారు. ప్రధానంగా తలనొప్పి, జలుబు వాటి నుండి ఉపశమనం కలగటానికి వాడుతుంటారు… ఆయుర్వేదంలో ఈ నీలగిరి ఆకులకు ప్రత్యేక స్థానం ఉన్నది. నీలగిరి చెట్టు ఎక్కువగా చల్లటి ప్రదేశాలలోనూ పెరుగుతుంటాయి. అలాగే కొండ ప్రాంతాల లోను ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రధానంగా దీని జలుబు, జ్వరలకు నివారణగా వాడుతారు.ఈ నీలగిరి తైలం ప్రయోజనాలు ఏంటో మనము ఇప్పుడు చూద్దాం.
*కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇతర నొప్పులు నివారణకు ఈ తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ నీలగిరి తైలాన్ని మోకాళ్ళ నొప్పులు నివారణ కోసం తయారుచేసి ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉంటారు. దీని ప్రభావం చాలా బాగా ఉంటుంది. *ఈ నీలగిరి తైలం నూనెను చర్మంపై పూసినప్పుడు దోమలు అలాగే కీటకాలను సమర్ధవంతంగా చంపేస్తుంది. *ఈ నీలగిరి తైలం మన చర్మం లో ఉండే సిరా మైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చుండ్రు, సోరియాసిస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తైలం రాయడం వలన మంచి ఉత్సవము కలుగుతుంది. *ఈ తైలం ఆకులలో యాంటీబ్యాక్రియలు, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
శతాబ్దాలుగా నీలగిరి తైలం ఆకులను సాంప్రదాయ వైద్యంలో గాయాలు నయం చేయడానికి పగిలిన పాదాలు, పొడి చర్మం, కీటకాలు కాటు, జలుబు, పుండ్లు లాంటి రకరకాల చర్మవ్యాధులకు మంచి చికిత్స చేసేవారు. ఈ నీలగిరి నూనె తేమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కావున నీలగిరి తైలం సారం మౌత్ వాసులు, టూత్ పేస్ట్ లను తయారు చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. *ఈ నీలగిరి తైలం తోనే ఎన్నో ఔషధాలను కూడా తయారుచేస్తారు. ప్రధానంగా జ్వరం, జలుబు నివారణ కోసం తయారు చేసే ఎన్నో ఆయుర్వేద లేపనాల ఎక్కువగా వాడుతూ ఉంటారు.