Gongura : ప్రతిరోజు ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంత…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gongura : ప్రతిరోజు ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంత…!!

 Authored By ramu | The Telugu News | Updated on :3 November 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Gongura : ప్రతిరోజు ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు... నమ్మలేని లాభాలు మీ సొంత...!!

Gongura : మన ఆరోగ్యానికి ఆకుకూరలు అనేవి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆకుకూరల లో గోంగూర కూడా ఒకటి. ఈ గోంగూరలో ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అలాగే ఈ గోంగూరను మాంసాహారంలో కూడా వేసి వండుతారు. ఈ కూర ఆహారానికి ఎంతో రుచి ని ఇస్తుంది. ఇకపోతే గోంగూర చట్నీ అంటే ఇష్టపడిన వారంటూ ఉండరు. అలాగే ఈ గోంగూరను తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజు గోంగూరను తమ ఆహారంలో చేర్చుకోవాలి అని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే గోంగూరను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గోంగూరలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ గోంగూర శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. అలాగే గుండె సమస్యలను మన దరి చేరకుండా చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా గోంగూర దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అలాగే గోంగూరను ప్రతి నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే గోంగూర ఫైబర్ కు పెట్టింది పేరు అని చెప్పొచ్చు…

Gongura ప్రతిరోజు ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు నమ్మలేని లాభాలు మీ సొంత

Gongura : ప్రతిరోజు ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంత…!!

గోంగూరను ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ బలోపేతమై,బరువును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే గోంగూరను నిత్యం తీసుకోవడం వలన కంటిచూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఉన్నటువంటి విటమిన్ ఏ అనేది దృష్టిలోపాన్ని నియంత్రిస్తుంది. అయితే ఈ గోంగూరలో ఉండే విటమిన్ ఏ రెటీనా మరియు కంటి వెనుక భాగంలో ఉన్న సున్నితమైన కణజాలాన్ని కూడా రక్షిస్తుంది. అంతేకాక గోంగూరలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. అందుకే గోంగూరను తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే దంతాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఈ గోంగూరలో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇది శరీరంలో ఆక్సీజన్ ను రవాణా చేయటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది