Hibiscus Tea : డైలీ మందార పువ్వుల టీ తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hibiscus Tea : డైలీ మందార పువ్వుల టీ తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!

Hibiscus Tea : మన ఇంటి ముందు ఎంతో అందంగా పూలు పూసే మందార మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తారు. ఇది కేవలం మన జుట్టుకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అని నిపునులు అంటున్నారు. అయితే ఈ మందార పూలతో టీ ని తయారు చేసుకొని నిత్యం తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,6:00 am

Hibiscus Tea : మన ఇంటి ముందు ఎంతో అందంగా పూలు పూసే మందార మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తారు. ఇది కేవలం మన జుట్టుకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అని నిపునులు అంటున్నారు. అయితే ఈ మందార పూలతో టీ ని తయారు చేసుకొని నిత్యం తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ మందార టీ ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…

మందార పూలతో తయారు చేసినటువంటి టిని నిత్యం తీసుకోవడం వలన గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాక అల్జీమర్స్ మరియు ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ టీ ని తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఈ మందార టీ అనేది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ టీ ని తీసుకోవటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ కోసం ఎండిపోయినటువంటి మందార పువ్వుల రెమ్మలను రెండు లేక మూడు తీసుకోవాలి. వీటిని ఒక కప్పులో వేసుకొని దానిలో కొన్ని వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. అంతే మందార పువ్వులా టీ రెడీ అయినట్లే. దీనిని వడపోసుకున్న తరువాత దానిలో కొద్దిగా తేనె మరియు నిమ్మకాయ రసాన్ని వేసుకొని తాగాలి. ఇలా తయారు చేసినటువంటి మందార టీ ని తీసుకోవడం వలన ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కూడా కరిగించడంలో మేలు చేస్తుంది.

Hibiscus Tea డైలీ మందార పువ్వుల టీ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

Hibiscus Tea : డైలీ మందార పువ్వుల టీ తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!

మనం తీసుకునేటటువంటి కార్బోహైడ్రేట్స్ ను కూడా ఫ్యాట్ గా మారకుండా అడ్డుకుంటుంది. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. అలాగే హై బీపీ తో బాధపడే వారు కూడా నిత్యం ఈ మందార టీ ని తాగాలి అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ టీ ని తీసుకోవడం వలన బిపి అనేది అదుపులో ఉంటుంది. మీరు ప్రతిరోజు ఈటీ ని తీసుకోవటం వలన హై బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు నిపుణులు. అలాగే కాలేయ ఆరోగ్యని కి కూడా ఈ మందార టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ అనేది మన శరీరంలో ఇతర రకాల టాక్సీన్స్ ను తొలగిస్తుంది. అలాగే ఈ మందార టీ లో యాంటీ డిప్రెసెంట్ ప్రాపర్టీలనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో యాంక్సైటీ మరియు డిప్రెషన్ లాంటి వాటిని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మం మరియు జుట్టును రక్షించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది