Hibiscus Tea : మందారం “టీ” చలికాలంలో ఆరోగ్యానికి గొప్ప ఔషధం… ట్రై చేసి చూడండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hibiscus Tea : మందారం “టీ” చలికాలంలో ఆరోగ్యానికి గొప్ప ఔషధం… ట్రై చేసి చూడండి…!

Hibiscus Tea : మందార పువ్వులు వాటి ఆకులు ఎన్నో రకాలుగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వాటిని జుట్టికి కూడా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అటువంటి మందార ఆకులు ఎండబెట్టి వాటితో టి తయారు చేసుకోవచ్చు.. వాటిని తేనె కలుపుకొని తీసుకోవచ్చు… ఈ మందార టీ యొక్క ఉపయోగాలు : చాలామందికి మందార పువ్వు గురించి తెలిసే ఉంటుంది. ఈ సున్నతమైన మందార పువ్వు ఎన్నో తీవ్రమైన రోగాలను తగ్గించగలిగే శక్తి ఉన్నది. అయితే కొందరికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 December 2022,7:00 am

Hibiscus Tea : మందార పువ్వులు వాటి ఆకులు ఎన్నో రకాలుగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వాటిని జుట్టికి కూడా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అటువంటి మందార ఆకులు ఎండబెట్టి వాటితో టి తయారు చేసుకోవచ్చు.. వాటిని తేనె కలుపుకొని తీసుకోవచ్చు… ఈ మందార టీ యొక్క ఉపయోగాలు : చాలామందికి మందార పువ్వు గురించి తెలిసే ఉంటుంది. ఈ సున్నతమైన మందార పువ్వు ఎన్నో తీవ్రమైన రోగాలను తగ్గించగలిగే శక్తి ఉన్నది. అయితే కొందరికి ఈ విషయం తెలిసి ఉండదు. మందార పువ్వులతో తయారు చేసిన టీ తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

మందారలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి : మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా ఉన్నాయి. కణజాలతో సమృద్ధిగా ఉన్న మందారటి జుట్టుని బలోపితం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని జుట్టుకి అప్లై చేయడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. బరువు తగ్గడానికి : బరువు తగ్గాలనుకునే వాళ్ళు మందారటి తీసుకోవచ్చు. ఈ మందార టీ లో ఎంజైములు ఉంటాయి. కాబట్టి శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువుని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది : గుండెకు మేలు చేసే చెడు కొలెస్ట్రాలు గుండెకు చాలా ప్రమాదకరం ఈ మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు చెల్లు కొలెస్ట్రాలను అదుపులో ఉంచుతాయి.

Hibiscus tea is a great remedy for health in winters

Hibiscus tea is a great remedy for health in winters

అలాగే మందార పూలతో చేసిన హెర్బల్ టీ వలన రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ : ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి ఈ మందార పువ్వులు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్, యాంటీ పరాసిటిక్ గుణాలు ఉంటాయి. ఈ మందార పూలతో చేసిన టీ తీసుకోవడం వలన ఫంగస్ బ్యాక్టీరియా లాంటి అనేక రకాల శారీరిక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు.. షుగర్ వ్యాధికి చాలా మేలు చేస్తుంది : మందార ఆకుల సారం యాంటీ బయాటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ మందార టీ తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. షుగర్ వ్యాధికి మందార చాలా బాగా సహాయపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది