Health Benefits : అమ్మమ్మ చేసే ఈ కాషాయం రెండు రోజులు తాగితే ఎటువంటి జలుబు వైన సరే చిటికలో మాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : అమ్మమ్మ చేసే ఈ కాషాయం రెండు రోజులు తాగితే ఎటువంటి జలుబు వైన సరే చిటికలో మాయం..!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 October 2022,6:30 am

Health Benefits : ఈరోజు ఒక మంచి కషాయం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మా చిన్నప్పటినుంచి కూడా అమ్మమ్మ ఇంట్లో జలుబు దగ్గు చేసినప్పుడు ఇస్తూ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా జస్ట్ రెండు లేదా మూడు రోజులు పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ అంతా కషాయం తీసుకుంటే చాలండి ఎలాంటి జలువైన, దగ్గయినా, వికారం లాంటివైనా పూర్తిగా మట్టిమయం అయిపోతాయి. రెండేళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కషాయాన్ని చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కదండీ సో ఇంట్లో ఒకరికి జలుబు దగ్గు వస్తే ఇంకొకలికి స్ప్రెడ్ అయిపోతుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఔషధాలతో చక్కగా ఈ కషాయాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, లవంగాలు, లెమన్ గ్రాస్ దాల్చిన చెక్క, వాము, పుదీనా, తులసి ఆకులు, బెల్లంపొడి, అల్లం, పసుపు, మిర్యాల పొడి, రెండు గ్లాసుల నీళ్లు మొదలైనవి..

దీని తయారీ విధానం : ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ ని ఆడ్ చేసుకోండి. ఇందులోకి రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క వేయండి. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్ కింద చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులో 5 లేదా 6 లవంగ మొగ్గలు వేసుకోండి. ఇది బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీస్పూన్ దాకా జీలకర్రని ఆడ్ చేసుకోండి డయస్ట్వ్ సిస్టం కి కూడా బాగా ఉపయోగపడుతుందిఅన్నమాట జీర్ణశక్తి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న మిరియాలు వేసుకోండి. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్ అలాగే ఆంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచుదాక అల్లాని కొద్దిగా క్రష్ చేసుకుని ఆడ్ చేసుకోండి.

Health Benefits Of Kashayam For Cold Cough Throat Pain

Health Benefits Of  Kashayam For Cold Cough Throat Pain

ఈ అల్లం అనేది వికారాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు దాకా పుదీనాని తుంచుకుని వేసుకోండి. ఈ పుదీనా అనేది గ్యాస్ని కంట్రోల్ చేస్తూ డైజెస్టివ్ సిస్టంకి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక రెమ్మ దాకా తులసి ఆకుల్ని కూడా తుంచుకుని వేసుకోండి. ఈ తులసి ఆకులు ఎన్నో రకాల జబ్బులకి ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా లెమన్ గ్రాస్ ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. లెమన్ గ్రాస్ లో ఇన్ఫెక్షన్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇంట్లో లేకపోతే దీనికి బదులుగా నిమ్మచెక్కనైన వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి.

పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియాలని మనందరికీ తెలుసు చివరిగా ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడిని గాని తురుముకున్న బెల్లాన్ని గాని వేయండి. బెల్లానికి చాలానే ఔషధ గుణాలు ఉన్నాయండి. అందుకే ఆయుర్వేదంలో ఏ కషాయం లోకైనా ఏదైనా ఔషధం లోకైనా ఈ బెల్లాన్ని కంపల్సరిగా ఆడ్ చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మనం చేసుకునే కషాయంలో ఉపయోగపడే విషయం ఏంటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో వీటన్నిటిని వేసేసిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత స్టౌ ఆపేసేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచి అప్పుడు ఫిల్టర్ చేసుకుని ఈ కషాయాన్ని తీసుకోండి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇకషాయం చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది