Health Benefits : ఈ ఆకు రసం దివ్య ఔషధం… ఊపిరితిత్తుల సమస్య, మధుమేహంతో పాటు ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…!
Health Benefits : ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కల్లో ఎన్నో మొక్కలు ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధం లాగా పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో మొక్కలు చెట్లు మూలికలను ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వీటిలో ఒకటి రావి ఆకు. ఇది హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఈ రావి చెట్టుని దైవంగా కొలుస్తూ ఉంటారు. ఈ చెట్లు మూడు కోట్ల మంది దేవతల రూపాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అలాగే ఇది ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులకు నివారినీగా ప్రసిద్ధి చెందినది. రావి చెట్టు అనేది నాగరికత మొదలైనప్పటినుండి పూజించబడే చెట్టు.
మతపరమైన ప్రాముఖ్యత పాటు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్నది. ఈ పవిత్ర వృక్షం ఔషధ విలువలు కలిగి ఉండడంతో ప్రసిద్ధి దీనిని పాముకాటు లాంటి సహజ సంఘటన నుండి అలాగే మూత్రపిండ వ్యాధులు, ఉబ్బసం, చర్మవ్యాధులు, విరోచనాలు, మలబద్ధకం మీద సంబంధిత వ్యాధులకు దీనిని వాడుతూ ఉంటారు. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు గురించి మనం ఇప్పుడు చూద్దాం… ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రావి చెట్టులోని ప్రతి భాగం బెరడు, ఆకు, గింజలు, రెమ్మ దాని పండ్లు అనేక ఔషధ ఉపయోగాలు కలిగి ఉన్నది. ఈ చెట్టు ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీనిని ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం…
1) రావి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కావున సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు దీన్ని రసాన్ని తీసుకోవచ్చు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు రోజు పూలు ఆకుల రసాన్ని తీసుకోవాలి.
2) రావి ఆకులను తీసుకోవడం వలన కూడా బ్లడ్ లో చక్కెర లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. రావి ఆకులలో చక్కెర స్పైక్లను నియంత్రించే గుణాలు ఉన్నాయి. బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను సాధారణంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
3) రావి ఆకు ఒక సాహజ రక్త శుద్ధి దీనిని తీసుకోవడం వలన రక్తాన్ని శుభ్రం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసాన్ని నిత్యము తీసుకునే వారికి చర్మ సంబంధిత ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ముఖంలోని మచ్చలను, మొటిమలను తగ్గిస్తుంది.
4) ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య కూడా తగ్గిపోతుంది మీరు డయేరియాతో ఇబ్బంది పడినట్లయితే దాని రసం తాగడం వలన మీ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
5) మీరు ప్రతినిత్యము ఉదయం లేత ఆకుల రసాన్ని తీసుకోవడం వలన మీ ఊపిరితిత్తులను నిర్వీశేకరణ చేస్తుంది. ఊపిరితిత్తులలో వాపు సమస్యలు, శ్వాస సమస్యలు ఉన్నవాళ్లకి చాలా సహాయంగా ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.