Health Benefits : ఈ శీతాకాలంలో వేడివేడి “కూల్హాడ్ చాయ్” ఇది రుచిలోనే కాకుండా దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!!
Health Benefits : వణికించే చలిలో మనకి వేడివేడిగా ఏదో ఒకటి తాగాలి, తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ శీతకాలం చాలా అందంగా ఉంటాయి. ఈ చలిలో వేడివేడి పానీయాలు మనల్ని రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడివేడి టి లేదా కాఫీని తాగుతూ ఆహ్వానిస్తూ ఉంటాము. మన ఇండియాలో టీ రకాలకు కొదవే ఉండదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల చాలు దొరుకుతూ ఉంటాయి. ప్రధానంగా తందూరు చాయ్ ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది. వేడిగా పొగలు కక్కుతున్న టీ ని అంతకంటే వేడిగా ఉన్న మట్టి కుండలో పోసి ఇస్తే టీ గురించి మనం మర్చిపోలేము.. గ్రామాల నుండి నగరాల వరకు మట్టి కుండలోని టీ అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉండరు.
సహజంగా టీ షాప్ లలో పేపర్ కప్పులు లేదా గాజు గ్లాసులలో టీ ని ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రదేశాలను మట్టితో చేసిన కప్పులలో టీ ను ఇస్తూ ఉంటారు. దీని వలన చాయ్ అమ్ముకునే వారికి మాత్రమే కాకుండా టి కొనుక్కునే వాళ్లకి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ఎందుకనగా మట్టితో చేసిన కప్పులు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటాయి. కొన్ని రెస్టారెంట్లు మట్టికుండలలో చాయి ఇస్తు రెస్టారెంట్లు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధంగా మట్టి కుండలో చాయ్ తాగడం వలన మానసిక ఆనందం ఉంటుంది. అలాగే అద్భుతమైన శారీరక ప్రయోజనాలు కూడా పొందుతారు.
అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా పేగు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుందట ఇది యాసిడ్ సమస్యని కూడా తగ్గిస్తుంది. ప్లాస్టిక్ కప్పులు లేదా శుభ్రం చేయని గ్లాసులలో టీ తాగడం వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మట్టి కప్పుల లలో తాగితే అలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు. వీటిలో ఉండే ఆల్కలిన్ జీర్ణాశయంలో ఆమ్లాల ను అధిక ఉత్పత్తిని నిరోధిస్తూ ఉంటుంది. అదే ప్లాస్టిక్ తీసుకోవడం వలన పొట్టకు హాని కలిగించే రసాయనాలు శరీరంలోకి చేరుతూ ఉంటాయి. కాబట్టి మట్టి పాత్రలలో టీ తాగితే ఆరోగ్య సమస్యలు అసలు రావు.. ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కూడా కలుగుతాయి…